S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 12:09

హైదరాబాద్: పేపర్ లీక్ అయిందన్న సాకుతో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని వెంటనే అక్కడి నుంచి పంపివేశారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు విద్యార్థులు బయలుదేరగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

07/29/2016 - 12:09

హైదరాబాద్: ప్రజల కోసం పనిచేసే ఇంజనీర్లకు తాము అండగా ఉంటామని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల ముగ్గురు ఇంజనీర్లపై దాడి జరగడం సహించరాని విషయమన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

07/29/2016 - 12:08

విజయవాడ: హరితాంధ్ర ప్రదేశ్ కలను సాకారం చేసేందుకు ఎపి ప్రభుత్వం చేపట్టిన ‘మనం-వనం’ కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.

07/29/2016 - 12:08

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ త్వరలో ప్లాట్లు కేటాయిస్తామని సిఆర్‌డిఎ కమిషనర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. మిగిలిన 800 మంది రైతులు కూడా స్వచ్ఛందంగా భూములివ్వాలని ఆయన కోరారు. లేకుంటే భూసేకరణ చట్టం కింద భూములను తీసుకుంటామన్నారు.

07/29/2016 - 12:06

హైదరాబాద్: ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నగరంలోని కాచిగూడ వద్ద జరిగింది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, ఈ ఘటనకు దారితీసిన కారణాల గురించి దర్యాప్తు ప్రారంభించారు.

07/29/2016 - 12:06

మెదక్: లాఠీచార్జిలో గాయపడిన మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీని పోలీసులు ఒంటిమామిడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతులను పరామర్శించేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

07/29/2016 - 11:52

హైదరాబాద్ : ఆగష్టు చివరి వారంలో ఎంసెట్-3 పరీక్ష నిర్వహించి, సెప్టెంబర్ తొలి వారంలో ఫలితాలు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఎంసెట్-2ను రద్దు చేస్తే మళ్లీ ప్రకటన చేయాల్సిన అవసరం లేదని, ఎంసెట్-1ను కూడా రద్దు చేస్తే అప్పుడు ప్రకటన చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్నతవిద్యామండలి, జేఎన్‌టీయూ ఎంసెట్-3 తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిసింది.

07/29/2016 - 11:48

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజి కేసులో నిందితులు విష్ణు, తిరుమల్‌ను వైద్య పరీక్షల అనంతరం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత రాత్రి విష్ణు, తిరుమల్‌ను సీఐడీ పోలీసుల అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మరోవైపు ప్రధాన నిందితుడు రాజగోపాల్‌ను సీఐడీ విచారిస్తున్నారు.

07/29/2016 - 11:45

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చ జరుగనుంది. చర్చలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదాపై స్ఫష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదాపై నిన్న చర్చ అసంపూర్ణంగా ముగియడంతో ఈరోజు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు హోదాపై చర్చ జరిపి, అరుణ్‌జైట్లీ సమాధానం ఉంటుందని భావించారు.

07/29/2016 - 11:42

గడ్చిరోలి (మహారాష్ట్ర) : గడ్చిరోలి జిల్లా థనోరా అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. తప్పించుకున్న మావోల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Pages