S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 01:45

ఒంగోలు, జూలై 28: జిల్లాలో ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రజాసాధికార సర్వే ప్రత్యేక అధికారి కరికాలవళవన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రకాశం భవనం వీడియో కాన్ఫ్‌రెన్స్ హాలులో ప్రజాసాధికార సర్వే కార్యక్రమ నిర్వహణ గురించి జిల్లా అధికారులతో కరికాల వళవన్ సమీక్షించారు.

07/29/2016 - 01:44

పర్చూరు, జూలై 28: త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చీరాల డిఎస్పీ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. డిఎస్పీ మండలం కేంద్రమైన పర్చూరులోని బొమ్మలసెంటరులో గురువారం గుంటూరు వైపు వెళ్తే ఆర్ అండ్ బి రోడ్డును పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

07/29/2016 - 01:44

ఒంగోలు, జూలై 28: దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం బలంగా పెరగాలని, ఇందుకోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఐదురోజులుగా జరుగుతున్న సిపిఎం రాష్ట్ర రాజకీయశిక్షణా తరగతులు గురువారంతో ముగిసాయి. చివరి రోజు తరగతుల్లో పార్టీ కార్యకర్తలు - పనివిధానంపై మాట్లాడారు.

07/29/2016 - 01:42

శ్రీకాకుళం(టౌన్), జూలై 28: డయల్ యువర్ మినిస్టర్ కార్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇదే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహిస్తే 33 వినతులు వచ్చాయన్నారు. అయితే, సమయాభావం, ఒక్కో వ్యక్తి అధిక సమయం తీసుకోవడం వలన వినతులు తగ్గినట్టు ఆమె చెప్పారు.

07/29/2016 - 01:41

శ్రీకాకుళం, జూలై 28: రాష్ట్రంలో మరింత మెరుగైన పాలన అందించే దిశగా తమపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లేలా నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు.

07/29/2016 - 01:41

శ్రీకాకుళం, జూలై 28: టెక్కలి మండలంలో నివాసం ఉంటున్న టి.గోపికృష్ణ అనే ప్రొఫెసర్‌ను లిబియా ఉగ్రవాదులు బందీగా ఉంచారని, వారి నుంచి విమూక్తి కల్పించమంటూ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్‌నాయుడు కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి గోపీకృష్ణ కుటుంబ సభ్యులు పడుతున్న వేదన వివరించారు.

07/29/2016 - 01:40

శ్రీకాకుళం, జూలై 28: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకంలో భాగంగా గురువారం ఆమదావలస మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపురంలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో 512 గృహాలను నిర్మించేందుకు ఆమె శంకుస్థాపన చేసారు.

07/29/2016 - 01:40

శ్రీకాకుళం(రూరల్), జూలై 28: జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ జిల్లాకు అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటున చేసిన అభినందన వీడ్కోలు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

07/29/2016 - 01:39

శ్రీకాకుళం, జూలై 28: పారదర్శకంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్న ఈ పాస్ పుస్తకాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారని క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించిపోయాయని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం రెండో రోజు సమీక్షలో ఏకరువు పెట్టుకున్నారు.

07/29/2016 - 01:39

శ్రీకాకుళం(టౌన్), జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల రేషన్ డిపో డీలర్లకు ప్రస్తుతం అందజేస్తున్న కమీషన్‌ను మూడు రెట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జిల్లా డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను వారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Pages