S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మమ్మల్ని బలి చేయకండి!

వరంగల్, జూలై 28: ‘ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బలిచేయకండి. తాము కష్టపడి చదువుకొని ర్యాం కులు సాధించుకున్నాం. ఇప్పటికే రెండుసార్లు ఎంసెట్ రాశాం’ అంటూ ఎంసెట్-2లో మెడిసిన్‌కు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులు గురువారం వరంగల్‌లో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిని కలిసి వేడుకున్నారు.
హరితహార కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్‌కు వచ్చిన డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సర్క్యూట్ గెస్ట్‌హౌజ్‌లో ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్షించి బయటకు వస్తుండగా విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా కడియంను చుట్టుముట్టారు. ఇప్పటికే రెండుసార్లు కష్టపడి పరీక్ష రాశామని, తిరిగి మరోసారి రాయమంటే తమ పరిస్థితి ఏమిటని వారు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ముందు వాపోయారు. మూడోసారి కూడా ఎంసెట్ లీక్ కాదని గ్యారెంటీ ఏంటి సార్ అని వారు డిప్యూటీ సిఎంను ప్రశ్నించారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలే తప్ప మరోసారి ఎంసెట్ నిర్వహించవద్దని వారు వేడుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా ఎంసెట్ లీక్‌పై నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో బిజెవైయం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.