S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 02:07

కర్నూలు, జూలై 28: శ్రీశైలం జలాశయం నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు గురువారం నీరు విడుదల చేశారు. కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు 6,413 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 808.50 అడుగులకు చేరగా 33.43 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

07/29/2016 - 02:07

హైదరాబాద్, జూలై 28: ఆంధ్ర ఏసిబి వలలో అవినీతి తిమిలింగం చిక్కింది. హైదరాబాద్‌లో పాఠశాల విద్యలో ప్రభుత్వ పరీక్షల ఇంచార్జీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎంఆర్ ప్రవీణ్ కుమార్ డిఇడి కాలేజీల్లో మేనేజిమెంట్ కోటా, కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లకు సంబంధించి ఎంపికైన విద్యార్థుల జాబితాను తనిఖీ చేసేందుకు వెయ్యి రూపాయల చొప్పున ప్రతి విద్యార్థి

07/29/2016 - 02:06

విజయవాడ, జూలై 28: కృష్ణా పుష్కరాలకు కేవలం 15 రోజులు వ్యవధి మాత్రమే ఉండటంతో పుష్కర పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పుష్కర విధులు నిర్వహించేందుకు పోలీసు బలగాలు, ఉన్నతాధికారులు విజయవాడకు చేరుకుంటున్నారు. ప్రత్యేక అధికారులు ఇప్పటికే పుష్కర ఘాట్లలో జరుగుతున్న పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.యాత్రికులకు ఏ చిన్న సమస్యా ఎదురుకాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

07/29/2016 - 01:59

అనంతపురం, జూలై 28 : చేపల విక్రయాలు పెంచడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై మత్స్యశాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మత్స్యకారులకు భారీగా రాయితీలు ప్రకటించింది. చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, అమ్మకాలు పెంచేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు, ఐస్‌పెట్టెలు అందిస్తోంది. చేపల పెంపకంతోపాటు విక్రయాలను పెంచేందుకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

07/29/2016 - 01:58

డి.హీరేహాల్, జూలై 28 : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల లారీని డి.హీరేహాల్ పోలీసులు గురువారం ఓబుళాపురం చెక్‌పోస్టు సమీపంలో వెంటాడి పట్టుకున్నారు. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు కడప జిల్లా కమలాపురం నుంచి కర్నూలు జిల్లా ఆలూరు మీదుగా బళ్లారికి తరలిస్తున్నట్లు ఎస్పీ ఆదేశాలతో అప్రమత్తమైనట్లు తెలిపారు.

07/29/2016 - 01:57

కదిరి టౌన్, జూలై 28: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పుకు వచ్చిన వారికి డబ్బులు ఇస్తేనే కాన్పులు చేస్తామని, అత్యవసరమైతే తనకు చెందిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురావాలని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు డిమాండ్ చేసిందంటూ గర్భిణీల బంధువులు గురువారం ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి.

07/29/2016 - 01:57

అనంతపురం, జూలై 28 : ఇకపై స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ముందు జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలోని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా సబ్ డివిజన్ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. ఇందుకు రాష్ట్రంలోనే జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

07/29/2016 - 01:56

గుంతకల్లురూరల్, జూలై 28 : మానవ మనుగడకు ప్రధానమైన మొక్కలను ప్రతి ఒక్కరూ విరివిగా నాటి సంరంక్షించాలని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమంపై గురువారం పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు మహార్యాలీ నిర్వహించారు.

07/29/2016 - 01:56

ధర్మవరం రూరల్, జూలై 28: తాడిమర్రి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలోని 7మంది డైరెక్టర్లు గురువారం రాజీనామా చేశారు. దీంతో 13మంది డైరెక్టర్లు వున్న సింగిల్‌విండోలో 7మంది రాజీనామా చేయడంతో సింగిల్‌విండో పాలకవర్గం రద్దయింది. తాడిమర్రి సింగిల్‌విండోకు చెందిన 7మంది డైరెక్టర్లు ధర్మవరం డివిజనల్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి శ్రీనివాసరెడ్డికి తమ రాజీనామాలను సమర్పించారు.

07/29/2016 - 01:55

హిందూపురం రూరల్, జూలై 28 : పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లాలో ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి హేమసాగర్ అన్నారు. ఇందులో భాగంగానే హిందూపురం రూరల్ మండల పరిధిలోని గోళ్లాపురం సమీపంలో 381.75 హెక్టార్లలో రూ.465.51 కోట్లతో ఏపిఐఐసి ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Pages