S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీశైలం నీరు విడుదల

కర్నూలు, జూలై 28: శ్రీశైలం జలాశయం నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు గురువారం నీరు విడుదల చేశారు. కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు 6,413 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 808.50 అడుగులకు చేరగా 33.43 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి 40 వేల క్యూసెక్కులు, రోజా గేజ్ పాయింట్ నుంచి 4,412 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంటోందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి 10 టిఎంసిల నీటిని సాగర్‌కు విడుదల చేయాలన్న ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.