S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మత్స్యకారులకు రాయితీలు

అనంతపురం, జూలై 28 : చేపల విక్రయాలు పెంచడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై మత్స్యశాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మత్స్యకారులకు భారీగా రాయితీలు ప్రకటించింది. చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, అమ్మకాలు పెంచేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు, ఐస్‌పెట్టెలు అందిస్తోంది. చేపల పెంపకంతోపాటు విక్రయాలను పెంచేందుకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చేపల సంచార విక్రయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ మార్కెటింగ్ సదుపాయాలు, వివిధ రకాల చేపల వినియోగం, సౌకర్యాలు, చేపల దిగుమతి, విక్రయ ధరలు, రవాణా తదితర అంశాలపై సర్వే చేపట్టింది. ఈ సర్వేలో నగరంలోని కొత్తూరు జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న చేపట మార్కెట్, రైతు బజార్, పిటిసి వద్ద జరుగుతున్న అమ్మకాలతోపాటు వివిధ ప్రదేశాల్లో విక్రయిస్తున్న వ్యాపారులను కలిసి సర్వే చేపట్టారు. కట్ల, బొచ్చ, కృష్ణబొచ్చ, మోసు(మృగాల), రాగండి తదితర రకాల చేపలు అధికంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. అధిక భాగం చేపలు స్థానికంగా చెరువులు, సొసైటీలు, సొంత ఫిష్‌పాండ్లలో ఉత్పత్తి చేసినవే కాకుండా, కృష్ణా జిల్లా కైకలూరు, విజయవాడ ప్రాంతాల నుంచి చేపలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నగరంలోని పిటిసి వద్ద చికెన్ మార్కెట్ తరహాలో చేపల విక్రయానికి దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ సేల్స్ (సంచార విక్రయాలు)కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్, టు వీలర్స్‌ను వినియోగించనున్నారు. వీటిని ఎస్‌సి, ఎస్‌టి, బిసి విక్రయదారులకు సబ్సిడీపై అందించేందుకు మత్స్యశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాకు 6 లేదా 7 ఫోర్ వీలర్స్, 15-20 దాకా త్రీ వీలర్స్ (ఆటో తరహా), 5 లేదా 6 టూ వీలర్స్ (బైకులు), అలాగే రూ.10 వేల నుంచి రూ.20 వేల విలువజేసే వలలు, ఐస్ పెట్టెలను అందించనున్నారు. చేపల విక్రయమే జీవనాధారంగా కలిగిన వారు, చేపల సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరిలో ఎస్‌సి, ఎస్‌టీలకు 90, బిసిలకు 50 శాతం మేరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు పిలవనున్నారు. అనంతరం ఎంపిడిఓల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.
ఉత్పత్తికి చేప పిల్లల సరఫరా..
ఉత్పత్తి కోసం జిల్లామత్స్య శాఖ అధికారులు వివిధ ప్రాంతాలకు చేప పిల్లలను సరఫరా చేసింది. ఇందులో భాగంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మిడ్ పెన్నార్ రిజర్వాయర్‌లో 500 లక్షలు, అనంతపురంలో క్యాప్టివ్ రేరింగ్ పాండ్స్‌కు 400 లక్షలు చేప పిల్లల్ని వదిలారు. ఎంపిఆర్ మత్స్య క్షేత్రంలో 111, అనంతపురం మత్స్య క్షేత్రంలో 35 లక్షల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించి తల్లిచేపలను పెంచారు. ఇవి గుడ్లు పెట్టిన అనంతరం ఉత్పతె్తైన మూడు రోజుల వయస్సు ఉన్న చేప పిల్లలను పిఎబిఆర్ మత్స్యక్షేత్రంలో ఉన్న సిమెంటు తొట్టెల్లో నెల రోజుల పాటు పెంచేందుకు 19 లక్షలు, భైరవానితిప్ప ప్రాజెక్టులో 12 లక్షల మేరకు చేప పిల్లల్ని వదిలారు. అలాగే కడప, రాజంపేట, బ్రహ్మంగారి మఠంలో ఉన్న మత్స్య క్షేత్రాలకు 75 లక్షలు, చిత్తూరు జిల్లా పీలేరుకు 10 లక్షలు చొప్పున చేప పిల్లల్ని సరఫరా చేశారు. వీటిని నెల రోజుల తర్వాత ఫిష్‌ఫాండ్స్ నిర్వాహకులు, చేపల సొసైటీలకు సరఫరా చేస్తారు.
మార్కెటింగ్ పెంచుకుంటాం
* ఎడి నాగేశ్వరరావు
చేపల అధికోత్పత్తి చేయడంతోపాటు మొబైల్, దుకాణాల ఏర్పాటు ద్వారా విక్రయాలు సాగిస్తూ ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో చేపల మార్కెట్లతోపాటు వివిధ ప్రాంతాల్లో మొత్తం 72 మంది చేపల అమ్మకందారులు ఉన్నారు. ప్రతి ఆదివారం కనీసం 10,740 కిలోల (10 టన్నులు), మంగళవారం 6 టన్నులు, మిగతా రోజుల్లో కనీసం 4 టన్నుల చేపలు అమ్ముడవుతున్నాయి. రకాన్ని బట్టి రూ.100- 130 వరకూ విక్రయిస్తున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర శాఖ అధికారుల ఆదేశాల మేరకు చేపల విక్రయాల్ని పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం.