S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 21:37

హరిత హారం పేరిట- గ్రామ గ్రామాలా, వాడవాడలా మొక్కలు నాటే ఉద్యమం ఒకటి తెలంగాణలో జోరుగా సాగుతున్నది. కానీ, హరితహారం విషయంలో- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను ఉత్తర ప్రదేశ్ కొట్టేసింది. ఈమధ్యనే ఉత్తరప్రదేశ్ ఇరవై నాలుగు గంటల కాలంలో 4 కోట్ల 93 లక్షల మొక్కల్ని నాటి ఇంతవరకూ పాకిస్తాన్ పేరిట వున్న రికార్డును బ్రద్దలు కొట్టింది.

07/27/2016 - 21:34

అదో చిత్రమయిన ఆకాశ హోటలు. స్విట్జర్లాండులో ఆల్ఫ్స్ పర్వత శ్రేణి మధ్యనున్న గ్రావుబుండేన్ (దీనికి రకరకాల ఉచ్ఛారణలున్నాయి, ఆ దేశాల్ని బట్టి) కొండ ఎత్తు 6463 అడుగులు (ఎంత నిఖారుగా కొలిచారో!). దానిమీద నెల్‌స్టర్న్ హోటలు గ్రూపువారు ‘జీరో స్టార్ హోటల్’ పేరిట ఒక ఆరుబయటి హోటల్ని నిర్మించారు.

07/27/2016 - 21:32

పశ్చిమ బెంగాల్‌ని అకారాది క్రమంలో వెస్ట్‌బెంగాల్ గానే వ్యవహరించి- వెనక్కి నెట్టేశారు. ఇది తన పరువు ప్రతిష్ఠలకే భంగం అనుకున్న వెస్ట్‌బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ- రాష్ట్రం పేరు మార్చాలని- ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

07/27/2016 - 21:29

‘‘ప్రజల శ్రేయస్సు కోసం ఆ రోజు నా బిడ్డ నా వద్దకు వచ్చింది. ఆశీర్వదించమని అడిగంది. తల్లిగా నా నుంచి ఓ వరం అడిగింది. అపుడు నా మనసుకు చల్లని గాలులు వీచే శీతాకాల సాయంత్రం వలే అనిపించింది’’ పదహారేళ్ల క్రితం ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన రోజు జరిగిన సంఘటన గురించి 84 ఏళ్ల ఆమె తల్లి సఖిదేవి వెల్లడించిన స్ఫూర్తిదాయకమైన అభిప్రాయం. బిడ్డ కోసం ఆ తల్లి పదహారేళ్ల నుంచి ఎదురుచూస్తోంది.

07/27/2016 - 21:15

ఉగ్రవాదానికి ఎల్లలు లేవు. ఈ రోజు న్యూయార్కు నుంచి హైదరాబాద్ వరకు ప్రపంచ మంతా విస్తరించిన ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అన్ని దేశాల్లోని ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా కొత్త పద్ధతుల్లో ఉగ్రవాదం కోరలు చాపుతోంది.

07/27/2016 - 21:14

ఉగ్రవాదం, తీవ్రవాదాలకు మతం, ప్రాంతం, దేశం అనేవి ఉండవు. సమాజంలో పెడత్రోవపట్టిన యువత ఉగ్రవాదానికి రకరకాల కారణాలతో ఆకర్షితులవుతుంటారు. ఉగ్రవాదం నిర్మూలనకు తెలంగాణ పోలీసు అప్రమత్తంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసు, గ్రేహౌండ్స్ పోలీసులు అగ్రమార్గాన ఉన్నారు.

07/27/2016 - 21:12

ప్రపంచంలో అనేక దేశాలకు ఇస్లామిక్ ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థి దశ నుంచే ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి, లేకపోతే మరింత ప్రమాదంలో పడిపోతాం. ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన సిరియా, లెబనాన్ వంటి దేశాలవారికి ప్రపంచంలో ఏ దేశం ఆశ్రయం కల్పించలేదు. ఆశ్రయం కల్పించిన జర్మనీ లాంటి దేశాల్లో సైతం వీరు ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు.

07/27/2016 - 21:10

సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం దేశంలో పెరిగిపోయాయి. ఇది అనేక రకాలుగా విస్తరించింది. ఇది ఏ దేశానికీ మంచిదికాదు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పసిగట్టడానికి ఇంటిలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠపరచుకోవాలి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలను మట్టుపెడితే చాలా ఘోరాలు తగ్గిపోతాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్న విషయాన్నీ ఇంటిలిజెన్స్ విభాగం మాత్రమే గుర్తించగలుతుంది.

07/27/2016 - 21:09

ఉగ్రవాదం మన దేశానికే కాదు అంతర్జాతీయ సమస్యగా మారింది. ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిందే. ఉగ్రవాదం అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఉగ్రవాదాన్ని అమెరికా లోగడ ప్రోత్సహించి, చివరకు చిక్కుల్లో పడింది. ఆ చేదు అనుభవం అమెరికాకే ఎదురైంది. ఉగ్రవాదులు వివిధ దేశాల్లో ఆంతరంగికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారు. ఇరాక్‌లోనూ అమెరికా అదేవిధంగా ప్రోత్సహించింది.

07/27/2016 - 21:08

దేశంలో ప్రస్తుతం స్వతంత్ర పోలీస్ విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాజ్యాంగపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సిబిఐ)ని ఉపయోగించుకుంటోంది.

Pages