S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 21:07

టెర్రరిజానికి కులం లేదు, మతం లేదు, పైశాచికత్వమే వారి అభిమతం. కాబట్టి ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అన్ని పార్టీలూ రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. ఉగ్రవాదుల దాడుల్లో, మారణ హోమంలో మా పార్టీ భారీగా నష్టపోయింది. ఉక్కు మనిషి ఇందిరా గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.

07/27/2016 - 21:06

భారతదేశానికి ఉగ్రవాదం కొత్తకాదు. వెయ్యి సంవత్సరాలుగా ఉగ్రవాద దాడులకు భారత్ తల్లడిల్లుతోంది. ఉగ్రవాదం గురించి మాట్లాడే ముందు దాని మూలాల్లోకి వెళ్లాలి. మా దేశంలో ఉగ్రవాదం లేదు అని చెప్పుకునే ఐరోపా, అమెరికా దేశాలు ఈ రోజు ఉగ్రవాద పెనుభూతం తాకిడికి అల్లాడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సమస్యగా ఎదిగింది. ఉగ్రవాదం ఎక్కడ పుట్టింది.. ఎవరు పుట్టించారనేది అనే్వషిస్తే.. బిన్ లాడెన్ అయినా..

07/27/2016 - 21:05

ప్రస్తుతం దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న మారణహోమం మొత్తానికి తీవ్రవాదం, ఉగ్రవాదం కారణమని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఉగ్రవాదం, తీవ్రవాదం ముసుగులో అమాయకులైన పౌరులను పోలీసులు అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా సంబంధంలేని వారిని ఈ కేసులలో ఇరికిస్తున్నారు. మత, వామపక్ష తీవ్రవాదం ఏ వాదమైనా సరే హింసను అందరు ఖండించాల్సిందే.

07/27/2016 - 18:15

దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ మరోసారి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రశ్నించే గుణం ఉన్న వారి గొంతు నొక్కేస్తారని, తనను మోదీ చంపేస్తారని కేజ్రీ ఓ వీడియోలో పేర్కొన్నారు. పలు ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయిస్తున్నారని మోదీ రాజకీయాలే ఇందుకు కారణమన్నారు. ‘మోదీ నన్ను బతకనివ్వరు’ అంటూ ఆరోపించారు.

07/27/2016 - 18:14

హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డికి బుధవారం విజ్ఞప్తిచేశారు. పేపర్ లీక్ చేసినవారిని, దానిని కొన్న విద్యార్థులను కఠినంగా శిక్షించాలే తప్ప పరీక్షను రద్దు చేయాలనుకోవడం తగదని వారు తెలిపారు.

07/27/2016 - 18:14

గుంటూరు: సినిమా ప్రదర్శిస్తుండగా మంటలు చెలరేగి థియేటర్ పూర్తిగా కాలిపోయిన సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో బుధవారం జరిగింది. మంటలు వ్యాపించిన వెంటనే సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా సురక్షితంగా బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శకటం వచ్చేలోగా థియేటర్ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. థియేటర్ కాలిపోవడంతో మూడు కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం చెబుతోంది.

07/27/2016 - 18:13

హైదరాబాద్: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల జరిగిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు సిఐడి పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆరు బృందాలుగా ఏర్పడిన సిఐడి పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి బ్రోకర్లను, విద్యార్థులను, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలను క్షుణ్ణంగా విచారించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు.

07/27/2016 - 18:13

కడప: కడప జిల్లా పోలీసులు బుధవారం ఇద్దరు పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 26 దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. సినీనటి నీతూ అగర్వాల్ భర్త, కర్నూలు జిల్లాకు చెందిన స్మగ్లర్ మస్తాన్‌వలీని, చిత్తూరు జిల్లాకు చెందిన మరో బడా స్మగ్లర్ భాస్కర్‌ను అరెస్టు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో ఈ ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

07/27/2016 - 17:57

ఖమిష్లి: సిరియాలో ఖమిష్లి నగరంలో బుధవారం బాంబు దాడులు జరిగాయి. ఘటనలో 44 మంది చనిపోయారు. 150 మంది గాయపడ్డారు. బాంబుదాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.

07/27/2016 - 17:54

హైదరాబాద్‌ : గ్రూప్‌ -2లో అన్ని పోస్టులకు టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసే యోచనలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఉంది. మొత్తం 1027 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

Pages