S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 02:58

భువనగిరిలో హైస్కూల్‌లో ఒకనాడు సాయంత్రం 4 గంటల తర్వాత లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాను. 5 గంటలు కావస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఎవరూ లేరని అనుకున్నాను. బైటకుపోయే గేటు దగ్గరికి పోతున్నాను. నా పక్కనే వున్న తరగతి గదిలో చప్పుడు వినవచ్చింది. ఆ చప్పుడు ఏమిటని తెలుసుకునేందుకు ఆ గదికి వెళ్ళాను. ఒక్క పిల్లవాడే ఉన్నాడు. బోర్డుమీద రాస్తున్నాడు. చెరిపేస్తున్నాడు. ఐదు నిమిషాలు చూశాను.

07/28/2016 - 02:57

ఆ రెండు నల్ల జింకలనూ హిందీ చలన చిత్రనటుడు సల్మాన్‌ఖాన్ చంపాడన్నది పద్దెనిమిదేళ్లుగా దేశ ప్రజల విశ్వాసం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాం తంలో ఆ జింకలను క్రీస్తుశకం 1998 సెప్టెంబర్ 26న, 28న ఆయనే హత్యచేసినట్టు అభియోగాన్ని విచారించిన జోధ్‌పూర్ మహానగర ప్రధాన న్యాయమూర్తి కూడా విశ్వసించారు.

07/28/2016 - 02:55

మరో చారిత్రక రాజకీయ లాంఛనం పూర్తయింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికై హిల్లరీ రోథమ్ క్లింటన్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున నామాంకితురాలయింది. ఆమె అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం ఖాయమన్న విశ్వాసం డెమొక్రాటిక్ పార్టీ జాతీయ మహాసభలో వెల్లివిరిసింది. హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ పార్టీ నామాంకితురాలి-నామినీ-గా అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఖాయమని జూన్ నెల ఆరంభంలోనే స్పష్టమైంది.

07/27/2016 - 23:27

కడెం, జూలై 27: మండలంలోని ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గంగాపూర్, లక్ష్మిపూర్ అడవుల్లో బుధవారం రాష్ట్ర అటవీ శాఖ అడిషినల్ పిసిసి ఎఫ్ మధుసుదన్‌రావు, కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ గుప్తలు పైగ్రామాల్లోని అడవులను సందర్శించారు. పైగ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి పనులపై అడిషినల్ పిసిసిఎఫ్ ఆరాతీశారు.

07/27/2016 - 23:27

కడెం, జూలై 27: ఆదిలాబాద్ జిల్లాలోని అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు మూడు రోజుల నుండి ప్రాజెక్టు జలాశయంలో వేలాది క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుండడంతో ప్రాజెక్టు జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది.

07/27/2016 - 23:26

మంచిర్యాల, జూలై 27: నియోజక వర్గంలోని అన్నిగ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్యెల్యే ఎన్ దివాకర్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని హాజిపూర్, దొనబండ పరిధిలో పంచాయితీ రాజ్ నిధులతో చేపటే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను తనదృష్టికి తెస్తే వాటిని అధికారుల దృషికి తీసుకువెళ్ళి పనులు త్వరితగతున పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

07/27/2016 - 23:25

నార్నూర్, జూలై 27: ఏజెన్సీ పల్లెల్లో విషజ్వరాలు, అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి. మండలంలో గడిచిన 24 గంటల్లోనే నలుగురు మృత్యువాత పడిన సంఘటన అధికార వార్గల్లో అలజడి రేపుతోంది. మండలంలోని మేడిగూడ పంచాయతీ పరిధిలోని కునికాస గ్రామంలో కాంబ్లే రవికాంత్ (13) అనే బాలుడు బుధవారం అతిసార వ్యాధితో మృతి చెందాడు.

07/27/2016 - 23:23

ఆదిలాబాద్ టౌన్, జూలై 27: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు గురు, శుక్రవారాల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 28న ఉదయం 10 గంటలకు నిర్మల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో, అదే విధంగా మధ్యాహ్నం 2గంటలకు ఆర్ ఐవో కార్యాలయంలో, 29న ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

07/27/2016 - 23:21

మక్తల్, జూలై 27: ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి వైఖరికి నిరసనగా బుధవారం మక్తల్‌లోని అంతరాష్ట్ర రహదారిపై బిజెపి శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

07/27/2016 - 23:20

మహబూబ్‌నగర్, జూలై 27: కృష్ణా పుష్కరాలకు సంబందించి ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ టికె శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. ఘాట్ల వారిగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ ఘాట్ల నిర్మాణం మొదలుకుని అన్ని అంశాల పట్ల కూలంకుశంగా చర్చించారు.

Pages