S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 22:16

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన ‘బిచ్చగాడు’ సినిమా విజయయాత్ర కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి మంచి హిట్ కొట్టిన ఈ సినిమా విడుదలై 75 రోజులు దాటింది. మొత్తం 200 థియేటర్లలో ఇంకా ఆడుతోంది. ఈమధ్యకాలంలో 50 రోజులే గొప్ప అనుకుంటే.. శతదినోత్సవం వైపు దూసుకెళుతోంది బిచ్చగాడు సినిమా. మొదట్లో చాలా తక్కువ థియేటర్లలనుంచి క్రమంగా వందల థియేటర్లకు విస్తరించింది.

07/27/2016 - 22:13

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్, అందాల తార తమన్నా కీలకపాత్రల్లో నటిస్తున్న ‘కత్తిసందై’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దినెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు ‘ఒకడొచ్చాడు’టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

07/27/2016 - 22:12

సరైన అవకాశం ఒక్కటి రాగానే కొథ్దిమంది తారలు అలా అల్లుకుపోతుంటారు. కొద్దిమంది మాత్రం ఎన్ని మంచి అవకాశాలొచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేరు. అలాంటి భామల్లో అక్ష ఒకరు. ‘యువత’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్‌లో కందిరీగ లాంటి బంపర్ హిట్టుంది. ఆ తర్వాత కొన్ని మంచి సినిమాల్లోనూ నటించింది. సరైన ప్లానింగ్ లేక జోరు కొనసాగించలేకపోయింది.

07/27/2016 - 22:09

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కథలో రాజకుమారి’. నమితా ప్రమోద్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మాగ్నస్ సినీప్రైమ్ ప్రై.లి. పతాకంపై ‘కార్తికేయ’ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

07/27/2016 - 22:07

సినిమా నిర్మాణ రంగంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ మరోసారి కొత్త ప్రయోగానికి తెరతీసింది. శ్రీమంతుడు, రుద్రమదేవి, నాన్నకు ప్రేమతో, సుప్రీమ్, కబాలి వంటి చిత్రాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐదు క్రేజీ చిత్రాల నిర్మాణంలో ఉన్నారు. అన్ని చిత్రాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

07/27/2016 - 22:04

పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అమీర్‌పేటలో’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విజయోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, ఎప్పుడూ రద్దీగా వుండే అమీర్‌పేటలో అనేక రకాల మనస్తత్వాల మనుషులు తిరుగుతుంటారని, వారిని క్షుణ్ణంగా పరిశీలించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, మంచి విజయం సాధించాలని అన్నారు.

07/27/2016 - 22:02

కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘ఇజం’. దీనికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఆగస్టు 9 నుంచి నెలాఖరువరకు స్పెయిన్‌లో భారీ షెడ్యూల్ జరుగుతుంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

07/27/2016 - 21:59

సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘జక్కన్న’. ఈనెల 29న దీన్ని విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, అందరినీ మెప్పించేలా ఉన్న ఈ సినిమాను ఈనెల 29న గ్రాండ్‌గా విడుదల చేస్తామన్నారు.

07/27/2016 - 21:53

శ్రీ సత్య విదుర మూవీస్ పతాకంపై నాగశౌర్య, పారుల్, సరయు ప్రధాన తారాగణంగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీ జత లేక’. ఈ చిత్రం ఆడియోకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది.

07/27/2016 - 21:51

ఆర్.జె సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీష్, అవంతిక, సాయికుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరో హరీష్ జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో చిత్ర విశేషాలను తెలిపారు. దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ, హరీష్‌ను తాము పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు.

Pages