S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వతంత్ర పోలీస్ అవసరం

దేశంలో ప్రస్తుతం స్వతంత్ర పోలీస్ విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాజ్యాంగపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సిబిఐ)ని ఉపయోగించుకుంటోంది. రాజకీయంగా విపక్షాలను దెబ్బతీసేందుకు సిబిఐని ఒక ఆయుధంగా అధికారపార్టీ వాడుకుంటోంది. పాతకేసులను తోడడమో, ఏ చిన్న తప్పు జరిగినా విపక్షాలను భయపెట్టేందుకు సిబిఐ చేత కేసులు నమోదు చేయిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా సిఐడిని వాడుకుంటోంది. పోలీసు విభాగాన్ని రాజకీయ ప్రయోజనాలకు అధికార పార్టీ వినియోగించుకుంటోందని విపక్షంలో ఉండే పార్టీలు అధికార విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం విపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికారం చేపడితే ఆ పార్టీ నేతలు కూడా గతాన్ని మరచిపోయి, మళ్లీ పోలీసు విభాగాన్ని తమ ప్రయోజనాలకు వాడటం మొదలుపెడుతుంది. ఈ కారణంగానే దేశంలో విచారణల కోసం స్వతంత్రంగా వ్యవహరించే పోలీసు వ్యవస్థ రావాలి. ఈ వ్యవస్థ జుడిషియరీ కింద పనిచేయాలే తప్ప, రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారకూడదు. విచిత్రంగా ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు అధికారంలో ఎవరు ఉన్నా ఆమోదించడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో ఒక విధంగా, విపక్షంలో ఉండగా మరోరకంగా వ్యవహరిస్తున్నాయి. విపక్షంలో ఉండగా సిబిఐ పనితీరును విమర్శించే పార్టీ, రేపు అధికారంలోకి వస్తే అదే సిబిఐని తమ ప్రయోజనాలకోసం వాడుకుంటోంది. ఇలా ఉండగా వితీవ్రవాదం, ఉగ్రవాదం కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. అమెరికా, బ్రిటన్‌లాంటి అగ్రరాజ్యాలు కూడా ఉగ్రవాదం వల్ల బాధపడుతున్నాయి. ఐఎస్‌ఐఎస్ లాంటి సంస్థలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రవాదాన్ని అణచివేసేందుకు సంయుక్తంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తీవ్రవాదానికి కులం, మతం అన్నది లేదు. మతపరంగా ఆలోచించి రాజకీయ పార్టీలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించటం మంచిది కాదు. అంటువ్యాధిలా ప్రబలుతున్న తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు, తీవ్రవాద రహిత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

- ఎస్. రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్