S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

చొప్పదండి, జూలై 26: కరవు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. మంగళవారం చొప్పదండి నియోజగవర్గ కేంద్రంలోని జాతీయ రహదారిపై నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు బ్యాం కుల ఎదుట మహాధర్నాను నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ జిల్లా రైతులకు బ్యాం కులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. పైగా ప్రభుత్వం నుంచి వచ్చిన కొద్దిపాటి రుణమాఫీని వడ్డీ కిందే తీసేసుకొని అప్పును అలాగే ఉంచడంతో రైతులకు ఎలాంటి లబ్ధి జరగటం లేదన్నారు. దీంతో రైతాంగం నాలుగు, ఐదు రూపాయల వడ్డీతో ప్రైవేటుగా అప్పు తీసుకొస్తూ పంట పొలాలను తనఖా పెట్టాల్సి వస్తుందని, వెంటనే రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గంటకు పైగా జరిగిన రాస్తారోకోను చొప్పదండి ఎస్సై రవీందర్ వచ్చి విరమింప జేశారు. అనంతరం యూనియన్ బ్యాంకు మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సత్తు మల్లేశం, జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు వైద భూపతి, గంట రాములు, కిషన్, ఆరు మండలాల అధ్యక్షులతో పాటు రైతులు పాల్గొన్నారు.