S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓటేసిన ప్రజలపైనే లాఠీ ఎత్తిన ఘనుడు

హైదరాబాద్, జూలై 26: తన సొంత నియోజకవర్గంలోనే ప్రజలపై లాఠీచార్జి చేయించి దేశంలో ఏ సిఎం సాధించని విధంగా చరిత్రకెక్కారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద రాష్టస్థ్రాయి మహాధర్నా నిర్వహించారు. కమిటీ కన్వీనర్ బి.వెంకట్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బృందాకారత్‌తో పాటు ప్రధాన వక్తలుగా జస్టిస్ బి.చంద్రకుమార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు హాజరయ్యారు. ధర్నాను ఉద్దేశించి బృందా కారత్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూనిర్వాసితులను పరామర్శించటానికి ప్రతిపక్షాలు, వామపక్షాలు వెళ్తే పోలీసులను అడ్డంపెట్టి అడ్డుకోవటం దుర్మార్గమని అన్నారు. ‘‘కెసిఆర్ ముందు నీ కళ్లజోడు మార్చుకో..ఆయన కళ్లద్దాలు మార్చేందుకు ప్రజలు విరాళాలివ్వాలి.. అప్పుడు కానీ జరుగుతున్న వాస్తవాలు, నిజాలు తెలియవ’’ని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ తాను ప్రధాన సేవకుడినని చెబుతుంటాడు, కానీ, కార్పొరేట్, భూస్వాములకా లేదంటే ప్రజలకా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రజా, గిరిజన, పౌరసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మంగళవారం ఇందిరాపార్కు వద్ద రాష్టస్థ్రాయి మహాధర్నా చేస్తున్న మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కమిటీ. ధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిపిఎం నాయకురాలు బృందా కారత్