S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 06:09

ఇటిక్యాల, జూలై 26: ఆగస్టు నెలలో జరిగే కృష్ణాపుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బీచుపల్లి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న పుష్కరఘాట్ పనులను సందర్శించారు.

07/27/2016 - 06:08

గద్వాల, జూలై 26: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ఉదృతి స్థిరంగా కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.37 మీటర్ల స్థాయిలో 9.317 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 22వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువ శ్రీశైలం జలాశయంకు 27,615 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.

07/27/2016 - 06:07

నిన్న రెజ్లర్లు నర్సింగ్, సందీప్.. నేడు షాట్‌పుటర్ ఇందర్‌జీత్
డోపింగ్‌లో పట్టుబడుతున్న భారత అథ్లెట్లు

07/27/2016 - 06:07

కొత్తకోట, జూలై 26: పాలమూరు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను నిర్మిస్తే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవని రైతులను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మదనపురం గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకట్ నారాయణ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/27/2016 - 06:06

మహబూబ్‌నగర్, జూలై 26: గిరిజనుల స్థితి గతులను అధ్యయానాకి జిల్లాల పర్యటన చేస్తున్నామని ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పలు పథకాల అమలు తీరుతెన్నులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/27/2016 - 06:06

అడ్డాకుల, జూలై 26: మానవ మనుగడకు చెట్లే ఆధారమని జిల్లా కలెక్టర్ టి.కె శ్రీదేవి అన్నారు. మంగళవారం హరితహారంలో భాగంగా మండల పరిధిలోని కందూరు గ్రామ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ శ్రీదేవి మొక్కలు నాటారు. ముందుగా కలెక్టర్ శ్రీరామలింగ్వేర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/27/2016 - 06:05

కొత్తకోట, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో వనరులపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డిఆర్‌డిఎ బాలరాం వర్మ, డిప్యూటీ కమిషనర్లు బాల్ గోపాల్ శుక్లా, బాల్‌చందర్ త్రివేది, కర్ణా పాటిల్, మిత్రా మంగళవారం వికలాంగుల పునరావాస కేంద్రంలో అద్యాయనం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఎ పిడి బాలరాం వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏ విధంగా అబివృద్ధి చెందారో సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

07/27/2016 - 06:04

దుబాయి, జూలై 26: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసిసి బౌలర్ల ర్యాకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో ఆంటిగ్వాలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 83 పరుగులకు ఏడు వికెట్లు సాధించి భారత్ ఘన వజయంలో కీలపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అశ్విన్ 2015లో కూడా ఐసిసి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

07/27/2016 - 06:03

న్యూఢిల్లీ, జూలై 27: డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్‌కు అతని సహచర రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ బాసటగా నిలిచాడు. ఈ కుంభకోణంపై విస్తృతమైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని యోగేశ్వర్ దత్ మంగళవారం ఉద్ఘాటించాడు.

07/27/2016 - 06:02

అనంతపురం, జూలై 26 : పట్టు పరిశ్రమకు ప్రసిద్ధగాంచిన ‘అనంత’ జిల్లా నేడు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా 935 గ్రామాల్లో 24,566 మంది రైతులు 32,020 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. వీరిలో 15,929 మంది సన్నకారు, 5420 మంది చిన్నకారు, 3221 మంది పెద్ద రైతులు ఉన్నారు. ఇందులో బహువార్షిక పంట, నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే విక్టరీ-1 రకం మల్బరీని ఎక్కువగా పండిస్తున్నారు.

Pages