S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రైతు సమస్యలపై పోరాటాలు చేయాలి

నక్కలగుట్ట, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలోని రైతు సమస్యలపై స్పందించని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యురాలు సీతక్క పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా రైతు సంఘం కార్యవర్గ సమావేశం రైతు సంఘం అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందని అన్నారు. ముఖ్యమంత్రి తమ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేయిస్తూ అధిక లాభాలను గడిస్తున్నాడని, రాష్ట్రంలోని రైతులు చేస్తున్న వ్యవసాయంపై ఎందుకు శ్రద్ద లేదని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ, ప్రజాధనాన్ని లూటి చేయడానికి తన కుటుంబం మొత్తం అవినీతి, కమీషన్ల కోసం పాకులాడుతూ పరిపాలనను గాలికి వదిలివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతు సమస్యలపై జిల్లా రైతు సంఘం అధ్వర్యంలో రైతుల పక్షాన ఎప్పడికప్పుడు వారి సమస్యపై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం 56 మంది కార్యవర్గ సభ్యులతో జిల్లా రైతు సంఘం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, తాళ్ల జైపాల్, సారంగం, విజయ్‌కుమార్, సదానందం పాల్గొన్నారు.