S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కస్తూర్బా’లో అదే వ్యథ..

కౌటాల, జూలై 26: మంచి వాతావరణం, చదువుకునేందుకు అనువైన సకల సౌకర్యాలు, నాణ్యతతో కూడిన భోజనం, ఉచితంగా లభించే పుస్తకాలు ఆపై అన్ని రకాలా సౌకర్యాలు... ఇదీ ప్రభుత్వ వసతి గృహాల నమూనా. ఈ పరిస్థితులన్నింటికీ విరుద్దంగా తయారైంది కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం. ప్రారంభం నుంచి సమస్యలకు ఆనవాలైన విద్యార్థులకు కనీస వసతులు లేక, అరకొర భోజనంతో పతీయేడు వార్తలకెక్కే కస్తూర్బా వసతి గృహం మరోసారి అదే స్థితికి చేరుకుంది. గత పది రోజుల క్రితం బాబాపూర్‌లో కొనసాగుతున్న తాత్కాలిక కేంద్రం నుంచి కౌటాలలో నిర్మించిన నూతన భవనంలోకి వసతి గృహం మారినప్పటికీ విద్యార్థుల కష్టాలు మాత్రం ఇసుమంతైనా తీరలేదని చెప్పొచ్చు. వసతి గృహంలో మొత్తం 205 మంది విద్యార్థినిలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చదువుతుంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన విద్యార్థినిలు పాత భవనం దుస్థితిని మార్చి మెనూ అమలు చేయాలని రోడ్డెక్కగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప చొరవతో నూతన భవనంలోకి మారింది. ఈ క్రమంలోనే విద్యార్థుల పరిస్థితి, సౌకర్యాల గూర్చి తెలుసుకునేందుకు కౌటాల సి ఐ అచ్చేశ్వర్ రావు, తహసిల్దార్ యాకయ్య, ఎస్సై వెంకటేష్, విద్యాధికారి సోమయ్య, ఎంపిడివో రాజేశ్వర్ మంగళవారం ఉదయం కస్తూర్బా వసతి గృహానికి వెళ్లి అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఉదయం అల్పాహారాన్ని పరిశీలించగా, ఆలుగడ్డ తొక్కలతో కూడిన నాణ్యత, రుచి లేని కిచిడి దర్శనమివ్వగా దానిలో కలుపుకునేందుకు వేసే చింతచారు అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది.