S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్మల్ జిల్లా పైనే తర్జనభర్జన

ఆదిలాబాద్,జూలై 26: వచ్చే దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు సాగిస్తుండగా నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లాయి. తొలుత మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల విభజన ఖాయమని, కొత్త జిల్లా పేరు కొమరంభీం జిల్లాగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే మూడవ జిల్లాగా నిర్మల్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఇందు కోసం జిల్లా కలెక్టర్ జగన్మోహన్ కూడా నిర్మల్ కొత్తజిల్లా ఏర్పాటుపై ఆధ్యయనం చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజా కసరత్తు నేపథ్యంలో సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల మనుగడ కష్టసాధ్యమని, ఈ ప్రతిపాదనను వెనక్కి పంపాలని ఆధ్యయన కమిటీలు తేల్చిచెప్పడంతో నిర్మల్ జిల్లా ఆశావాహుల ఆశలకు గండికొట్టినట్లయింది. నిర్మల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల నుండి సంతకాల సేకరణ చేపట్టి ఇటీవలే ముఖ్యమంత్రి కెసి ఆర్‌ను కలిసి నిర్మల్ జిల్లా ఏర్పాటు చేయాలని వినతి పత్రం కూడా సమర్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ ప్రతిపాదనపై ఆలోచించి కొత్త జిల్లా ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గీయులు తమ పంతం నెగ్గిందని భావించారు. అంతేగాక బాసరలో పూజలు చేసి జ్ఞాన సరస్వతి జిల్లాగా నామకరణం చేస్తామని స్వయంగా మంత్రి ఐకెరెడ్డి మీడియా సమావేశంలోనూ ప్రకటించారు. దీంతో అప్పటి వరకు సాగిన అందోళనలు అఖిలపక్ష నేతలు విరమించుకున్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు ఖాయమని భావించగా డ్రాప్ట్ డిక్లరేషన్‌కు జిల్లా యంత్రాంగం కసరత్తు సాగిస్తుండగానే తాజాగా ప్రభుత్వం ఆధ్యయన కమిటీ నివేదిక మేరకు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలే శాస్ర్తియంగా సహేతుకమని తేల్చి చెప్పడంతో నిర్మల్ ప్రాంత ఆశావాహుల గొంతుల్లో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. మూడవ జిల్లాగా నిర్మల్ ప్రకటిస్తే దండేపల్లి, జన్నారం మండలాలు అందులో విలీనం చేయవద్దని రెండు మండలాల్లో ఉద్యమాలు వెల్లువెత్తాయి. పరిపాలన సౌలభ్యం కోసం మంచిర్యాల జిల్లాలోనే కలుపాలని అక్కడి పార్టీల నేతలు డిమాండ్ చేసి అందోళనలు సాగించారు. మరోవైపు ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బోథ్, నేరిడిగొండ మండలాలను నిర్మల్‌లో కలుపవద్దని ఈ ప్రాంత నేతల నుండి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మంత్రి జోగురామన్న సైతం ఆదిలాబాద్‌ను రెండు జిల్లాలుగానే విభజించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. రాజకీయ పరంగా అభివృద్ది పథంలో ఉన్న నిర్మల్‌ను జిల్లాగా ప్రకటించడం వల్ల పెద్దగా ప్రయోజనాలు, పరిపాలన పరంగా మనుగడ సాధించడం కష్టమని అధికారులు కూడా తుది నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఎలాగైన నిర్మల్ జిల్లా కోసం లాబీయింగ్ సాగిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అవుతుందని భావించి రాజకీయ నేతలు, రియల్టర్లు కోట్లాది రూపాయల భూములను కొనుగోలు చేసి నిర్మల్ ప్రాంతంలో వెంచర్ల రూపంలో రియల్ ఎస్టెట్ వ్యాపారం సాగిస్తుండగా ప్లాట్ల ధరలకు కూడా రెక్కలు వచ్చిపడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాజ్యాంగ బద్దంగా నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగానే ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుతో పాటు ఉద్యోగుల విభజన ప్రక్రియ ముందుగా సాగేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిర్మల్ జిల్లా తెరపైకి వచ్చి ఆశలు రేపి తర్జనభర్జన అనంతరం ప్రతిపాదన వెనక్కిమళ్లడంతో ఆప్రాంత రాజకీయ నేతలు, జిల్లా సాధన కమిటీ సభ్యులు మరో ఉద్యమానికి సిద్దపడుతున్నారు. నిర్మల్ నుండి బాసర వరకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం తెరవెనక నుండి అఖిలపక్ష నేతలకు మద్దతు పలుకుతూనే కొత్త జిల్లా కోసం పట్టువీడకుండా ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో జిల్లాల విభజన ఉత్కంఠతను రేపుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడితే పాత ఆదిలాబాద్ జిల్లా మాత్రం మరింత వెనకబడే అవకాశం లేకపోలేదని విశే్లషకులు భావిస్తున్నారు.