S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 06:02

జియాగ్జింగ్ (చైనా), జూలై 26: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో గత రెండు నెలల నుంచి దుమ్మురేపుతున్న తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్‌లో మరింత ఉన్నత స్థానానికి దూసుకెళ్లింది. ఇంతకుముందు ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచిన హారిక మంగళవారం తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు స్థానాలను మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకుకు ఎగబాకింది.

07/27/2016 - 06:00

అనంతపురం, జూలై 26 : జిల్లాలో ఫ్యాక్షన్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపి పూర్తిస్థాయిలో అణచి వేయాలని రేంజ్ డిఐజి జె.ప్రభాకర్‌రావు, ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన రౌడీషీటర్ల జంటహత్యల నేపథ్యంలో అనంతపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

07/27/2016 - 06:00

న్యూఢిల్లీ, జూలై 26: రియో ఒలింపిక్స్‌కు వెళ్లాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడానికి తాము కుట్ర పన్నినట్లు వస్తున్న ఆరోపణలను ప్రముఖ రెజ్లింగ్ కోచ్ సత్పాల్ సింగ్ మంగళవారం తోసిపుచ్చాడు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ఎటువంటి ఆధారాల్లేకుండా తనవైపు, తన అల్లుడి వైపు వేలెత్తి చూపడం సరికాదని ఆయన పేర్కొన్నాడు.

07/27/2016 - 06:00

అనంతపురం, జూలై 26 : మిషన్ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా జిల్లాను హరిత ‘అనంత’గా మార్చేందుకు అటవీ శాఖ కృ షి చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ఈనెల 29న 67వ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 1100 ప్రదేశాల్లో 10.30 లక్షల మొక్కలు నాటేందుకు 39 రకాల మొక్కలను సిద్ధం చేశారు.

07/27/2016 - 05:59

కోల్‌కతా, జూలై 26: తన రెండేళ్ల చీకటి రోజులను మరిచిపోయి, తనలాగే వివక్షను ఎదుర్కొనే వేలాది మంది అమాయకులకోసం రియోలో పతకం సాధించడమే తన లక్ష్యమని ఒలింపిక్స్‌లో వంద మీటర్ల స్ప్రింట్‌లో భారత్ తరఫున ఎంపికయిన రెండో మహిళ దుతీ చాంద్ అంటోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పిటి ఉష వందమీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్‌లో పోటీ పడిన తర్వాత మన దేశంనుంచి ఒలింపిక్స్‌కుఈ విభాగంలో ఎంపికయిన రెండో మహిళ దుతి కావడం గమనార్హం.

07/27/2016 - 05:59

అనంతపురం సిటీ, జూలై 26: వేరుశెనగ పంటకు రక్షక తడులను అందించి కాపాడే పంట సంజీవని కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. మంగళవారం రెవిన్యూ భవన్‌లో వ్యవసాయ అధికారులకు పంట సంజీవనిపై వర్కుషాపు నిర్వహించారు.

07/27/2016 - 05:58

తలుపుల, జూలై 26: 2019లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుని బిజెపి కార్యకర్తలు పనిచేయాలని జిల్లా బిజెపి అధ్యక్షులు అంకాల్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

07/27/2016 - 05:58

పుట్టపర్తి, జూలై 26: రూ.100 కోట్ల తో రాయలసీమలో పర్యాటక శాఖ అ భివృద్ధికి కృషి చేయనున్నట్లు కర్నూలు డివిజనల్ మేనేజర్ సుదర్శన్‌రావు, డిఈ ఈశ్వరయ్యలు తెలిపారు. మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ ముఖ్య అధికారులు కందా, అనీల్ కె.గుప్తలు పుట్టపర్తిలో పర్యటించారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, కార్యదర్శి ప్రసాదరావుతో వారు సంప్రదింపులు జరిపారు.

07/27/2016 - 05:57

పామిడి, జూలై 26: పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో గ్రామ దేవతగా వెలసిన పామిడమ్మ జాతరను భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ విఠోబా స్వాముల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉట్లతేరు ముగిసిన అనంతరం ఆషాడ బహుళ తదియ మంగళవారం పామిడమ్మ జాతరను నిర్వహించటం ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల రద్దీతో పామిడమ్మ దేవాలయం సమీపమంతా కిటకిటలాడింది.

07/27/2016 - 05:56

హిందూపురం, జూలై 26 : హిందూపురం, మడకశిర, పెనుకొండ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. గత రెండు నెలలతో పోల్చితే సోమవారం రాత్రి ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. రాత్రి 9.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుఝాము వరకు వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

Pages