S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రైతుల రుణమాఫీపై తెలుగుదేశం రాస్తారోకో

వడ్డేపల్లి, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెరాస ఎన్నికల మ్యానిఫెఫ్టోలో పొందుపరచిన రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆరోపించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్వర్యంలో జిల్లాలోని రైతుల రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని కోరుతూ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి నక్కలగుట్టలోని డిసిసి బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, బ్యాంకు ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫమైందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకం కోసం రైతులు గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ఆశలతో ఎదురుచూసి విసిగిపోయారని, అయినా కూడా ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా పోయాయని విమర్శించారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా రైతులకు ప్రభుత్వం నుండి సబ్సిడీలో విత్తనాలు, ఎరువులు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాత రుణాలను మాఫీ చేయకపోవడంతో, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన ఏ ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేదని, రైతు ఓటు బ్యాంకుతో అధికారం చేపట్టిన తెరాస ప్రభుత్వం కూడా పతనం కాక తప్పదని జోస్యం చెప్పారు. అనంతరం అరగంటపాటు రాస్తారోకో నిర్వహంచగా, సుబేదారి పోలీసుల చొరవతో రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈగ మల్లేశం, పుల్లూరి అశోక్, మార్క విజయ్‌కుమార్, తాళ్ల జైపాల్, సదానందం, సారంగం పాల్గొన్నారు.