S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:03

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలు నాటాలని, తద్వారా మొక్కలు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేయటంతో దాన్ని పీల్చుకుని మనం అనేక వ్యాధుల బారిన పడుకుండా ఉంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.

07/27/2016 - 04:02

హైదరాబాద్, జూలై 26: మీడియా కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ సాలిడారిటీ ఆఫ్ ఇండియా ప్రధానం చేసే ప్రతిష్ఠాత్మకమైన అబ్దుల్ కలాం నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ అవార్డు నగరానికి చెందిన డా.చంద్రకాంత్‌రావును వరించింది. పొగాకు వల్ల వచ్చే జబ్బుల నియంత్రణ, అనర్దాలపై గత రెండు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు మంగళవారం ఆయన మీడియాతో చెప్పారు.

07/27/2016 - 04:02

ముషీరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలోని 5వ షెడ్యూల్ భూభాగాన్ని (ఏజెన్సీప్రాంతాలను) నాలుగు జిల్లాలుగా ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో పోడు భూములను లాక్కోవడాన్ని, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన 48 గంటల మహాధర్నా మంగళవారంతో ముగిసింది.

07/27/2016 - 04:01

హైదరాబాద్, జూలై 26: భాగ్యనగరంలో ప్రజలకు జిహెచ్‌ఎంసి అందిస్తోన్న పౌరసేవల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు వివిధ అంశాలపై అధ్యయనం నిర్వహించేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంగళవారం దిల్లీ చేరుకుంది.

07/27/2016 - 04:01

పూర్వం విశ్వమంతా హిందూమతం విస్తరించి ఉండేది. ఏమతం వారైనా వారు పేర్కొనే దేవుళ్లు లేరు అని అనుకుంటే ఆయా మతాలు లుప్తమైపోతాయ. కానీ ఏ దేవుడూ లేడని వాదించినా హిందూమతం మాత్రం తన ఉనికిని కోల్పోదు. భగవంతుడు కాంతి స్వరూపుడు ఆయన్ను మనం చూడటం మనం చేసుకున్న పుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. భగవానుని రూపంపై దృష్టి కేంద్రీకరించడానికి ఒక ఆధారం అవసరం.

07/27/2016 - 03:59

నలబయ సంవత్సరాల కిందట 1974 సెప్టెంబర్‌లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల ఆభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఐడిసి) అనేక ఆటుపోట్లకు లోనైనా చివరకు నిలదొక్కుకుని ఏటా పది లక్షల ఎకరాలకు నీరు అందిస్తోంది. వ్యవసాయ రంగానికి పెద్ద పీటనే లక్ష్యంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల వ్యవస్థ మెట్టరైతుల అభిమానాన్ని పొందగలిగింది.

07/27/2016 - 03:53

మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశం రెండు ముక్కలైంది. కొన్ని వేల సంవత్సరాలుగా అఖండ భారత్‌గా ఉండి దేశం విభజన చెందడం నిజంగా ఎంతో బాధాకరమైన అంశమే. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి? గత జూన్ నెలలోజరిగిన రెండు సంఘటనలను పరిశీలిద్దాం. జూన్ నెల మొదటివారంలో పాతబస్తీలో ‘మతసహనం’ (కమ్యూనల్ హార్మనీ) పేరుతో మీనార్ తోటలో ఒక చర్చాకార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

07/27/2016 - 03:49

హిందీ చలనచిత్ర నటుడు సల్మాన్ ఖాన్ నల్ల జింకను హత్య చేసినట్టు నిరూపించడానికి తగినన్ని ఆధారాలు లేవన్నది రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం సోమవారం చెప్పిన తీర్పు.

07/27/2016 - 00:33

నల్లగొండ, జూలై 26: జిల్లాలో మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొనగా జూలై మాసాంతం గడిచినా సరైన వర్షాలు లేక పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. గత ఏడాది కూడా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపోయిన వర్షాభావం ఈ ఏడాది ఖరీఫ్ రైతులను మరోసారి భయపెడుతుంది. సరైన వర్షాలు లేక ఖరీఫ్ పంటల సాగు శాతం కేవలం 44శాతంకే పరిమితమైంది.

07/27/2016 - 00:33

తుర్కపల్లి, జూలై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరమార్శించేందుకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బృందాన్ని మెదక్ జిల్లా కొండపాక మండలం లింగాపురం వద్ధ పోలీసులు అడ్డుకుని బృందంలోని మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం 2గంటల నుండి 6-30వరకు ఆయనను పోలీస్ స్టేషన్‌లో నిర్భంధించారు.

Pages