S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ వర్షాభావమే..తగ్గిన పంటల సాగు!

నల్లగొండ, జూలై 26: జిల్లాలో మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొనగా జూలై మాసాంతం గడిచినా సరైన వర్షాలు లేక పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. గత ఏడాది కూడా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపోయిన వర్షాభావం ఈ ఏడాది ఖరీఫ్ రైతులను మరోసారి భయపెడుతుంది. సరైన వర్షాలు లేక ఖరీఫ్ పంటల సాగు శాతం కేవలం 44శాతంకే పరిమితమైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కోస్తాంధ్ర జిల్లాలకు ధీటుగా వరి పంటను పండించే జిల్లా రైతులు ఈ సీజన్‌లో కేవలం 12శాతం వరి సాగుకే పరిమితమైన వైనం ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ వర్షాకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో సాధారణ వర్షాపాతం 170.9మిల్లిమీటర్లు కాగా ఇప్పటిదాకా కేవలం 58.0మిల్లిమీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదైంది. -66.0మిల్లిమీటర్ల వర్షాపాతం లోటుగా ఉన్న తీరు ఖరీఫ్ పంటల సాగుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జిల్లాలోని 59మండలాల్లో ప్రస్తుతం 18మండలాల్లో మాత్రమే సాధారణ స్థాయి వర్షాపాతం నమోదవ్వగా 25మండలాల్లో సాధారణంకన్న తక్కువగా, ఐదు మండలాలు పూర్తిగా కరవులో, 11మండలాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైన తీరు వర్షాభావ పరిస్థితులను అద్దం పడుతున్నాయి.
సరైన రేయిన్‌గేజ్ మీటర్లు లేక వర్షాభావ తీవ్రత లెక్కల్లో తక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. జూన్ నెలలో సాధారణ కంటే అధికంగా వర్షాలు పడటంతో మురిసిపోయిన రైతాంగం తదుపరి కూడా ఇదే తరహాలో మంచి వర్షాలు పడుతాయన్న ఆలోచనతో వేసిన వర్షాధారిత మెట్ట పంటలు పత్తి, కంది, ఆముదం, వేరుశనగా వంటి పంటలు సరైన వర్షాలు లేక ఊష్ణోగ్రతలు తగ్గక వాడిపోతు రైతులను కలవర పెడుతున్నాయి. మంగళవారం నాటికి జిల్లాలో ఊష్ణోగ్రత గరిష్టం 34డిగ్రీలు, కనిష్టం 24.8డిగ్రీలుగా ఉండటం ఖరీఫ్ పంటలను దెబ్బతీస్తుంది. మరో వారం పది రోజుల్లోపు భారీ వర్షాలు పడకపోతే ఇప్పటికే పెట్టిన సాగు పెట్టుబడులు సైతం రైతాంగం నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది.
44శాతానికే పరిమితమైన ఖరీఫ్ పంటలు!
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 5,80,034హెక్టార్ల పంటల సాగు జరుగాల్సివుండగా ఇప్పటిదాకా 2,53,729హెకార్లలో కేవలం 44శాతం మేరకే పంటల సాగు జరిగింది. వేసిన పంటలు సైతం వర్షాభావంతో వాడిపోతు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా ఆకాశం వైపు వానాల కోసం ఎదురుచూపులు పెట్టిస్తున్నాయి. ఖరీఫ్‌లో సాధారణంగా 1,66,231హెక్టార్ల వరి సాగు జరుగాల్సివుండగా ఇప్పటిదాకా కేవలం 19,333హెక్టార్లలో 12శాతం మాత్రమే సాగయిన తీరు వర్షాభావ తీవ్రతను చాటుతుంది. జిల్లా రైతులు ఎక్కువగా సాగు చేసే పత్తి ఈ సాధారణ సాగు విస్తీర్ణం 2,97,721హెక్టార్లు కాగా 1లక్ష 74,402హెక్టార్లలో 59శాతం మేరకు సాగయింది. కంది పంట సాధార విస్తీర్ణం 25,156హెక్టార్లుకాగా 29,968హెక్టార్లలో, పెసరగా 23,195హెక్టార్లకు 23,490హెక్టార్లలో 100శాతంకు మించి సాగైంది.
ఇందుకు వర్షాభావం, మిషన్ కాకతీయ పనులతో చెరువుల కింద సాగు తగ్గిపోవడం, సాగర్, డిండి, మూసీ ప్రాజెక్టుల కింద నీటి వసతి లేక వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మరలడంతో పాటు ప్రభుత్వం పత్తికి బదులుగా పప్పు ధాన్యాల పంటల సాగు చేపట్టాలన్ని ప్రచారం కారణాలుగా కనిపిస్తున్నాయి.
వేరుశనగా 4,277హెక్టార్లకు 3,707హెక్టార్లలో, శనగా 976కు 248హెక్టార్లలో, ఆముదం 3,761హెక్టార్లకుగాను 46హెక్టార్లలో, మిరప పంట 5,243హెక్టార్లకు 10హెక్టార్లు, మొక్కజొన్న 2,927హెక్టార్లకు 1,118హెక్టార్లలో మాత్రం సాగయింది. అన్ని పంటలు కలిపి కేవలం 44శాతం మాత్రమే సాగవ్వడంతో ఇకముందు మంచి వర్షాలు పడితేనే సాగు విస్తీర్ణం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయ.
ముఖ్యంగా జిల్లాలో వర్షాలు పడటంతో ఎగువ ప్రాంతాల్లోని భారీ వర్షాలు, వరదలు వచ్చి నాగార్జున సాగర్, డిండి, మూసీ, అసఫ్‌నహర్ వంటి ప్రాజెక్టులన్ని నిండి కాలువలు సాగితే ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. లేనట్లయితే మరోసారి జిల్లా రైతాంగం కరవు దెబ్బకు గురికాక తప్పదని భావిస్తున్నారు.