S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:13

కెపిహెచ్‌బికాలనీ, జూలై 26: రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై విచారణ చేపట్టి వాటిని పరిరక్షించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రంజిత్‌కుమార్ షైనీని ఎమ్మెల్యే గాంధీ కోరారు.

07/27/2016 - 04:13

ఖైరతాబాద్, జూలై 26: ఫిలింనగర్ సొసైటీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సొసైటీ మాజీ సభ్యుడు రవి ప్రకాష్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సామాజికవేత్త ఎల్లారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. చెన్నైలో స్థిరపడ్డ సినీపరిశ్రమను హైదరాబాద్‌కు రప్పించేందుకు అప్పటి ప్రభుత్వం ఎంతో ఉదారంగా 98 ఎకరాలను ఫిలినగర్ సొసైటీకి అప్పగించిందని చెప్పారు.

07/27/2016 - 04:12

శేరిలింగంపల్లి, జూలై 26: శేరిలింగంపల్లిలోని డిగ్రీ కళాశాలకు స్వంత భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ విన్నవించారు.

07/27/2016 - 04:09

బేగంపేట, జూలై 26: నగరంలో ఇటీవల ఫిలింనగర్‌లో నిర్మా ణంలో వున్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మరవక ముందే సికిందరాబాద్ మరో విషాదం నెలకొంది. గత మూడు రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆర్‌పి రోడ్‌లోని మోండా మార్కెట్‌లో మంగళవారం ఓ పురాతనం భవనం నానడంతో కుప్పకూలింది. ఈ సంఘటనలో షాపు యజమాని గోపాల్ మృతి చెందాడు.

07/27/2016 - 04:08

హైదరాబాద్, జూలై 26: జిహెచ్‌ఎంసి వివిధ పౌరసేవల నిర్వహణకు చేస్తున్న వ్యయాన్ని ఆదా చేసేందుకు అధికారులు ప్రవేశపెడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో 57 ప్యాకేజీల్లో సుమారు నాలుగు లక్షల 5వేల వీది ధీపాలకు 24వేల స్విచ్‌లున్నాయి. వీటి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు గత కొద్ది సంవత్సరాలుగా జిహెచ్‌ఎంసి చేస్తున్న కృషి దశల వారీగా ఫలిస్తోంది.

07/27/2016 - 04:07

హైదరాబాద్, జూలై 26: మహానగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం పడిన తర్వాత వాతావరణం చల్లబడినట్టే పడి. ఆ తర్వాత భానుడి ప్రతాపంతో మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురిసింది.

07/27/2016 - 04:07

హైదరాబాద్, జూలై 26: అయిదు జిల్లాల పరిధులను కలుపుతూ ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బ. ఒకవైపు ఆర్థిక సంక్షోభం..మరోవైపు అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం కారణాలతో అసలు హెచ్‌ఎండిఏ శాఖ ఉందా? ఉంటే ఏ రకమైన విధులు నిర్వహిస్తోంది? అన్నది నగరంలో సామాన్యుడికి సమాధానం దొరకని ప్రశ్న.

07/27/2016 - 04:06

హైదరాబాద్, జూలై 26: తెల్లవారే కల్లా రోడ్లను పరిశుభ్రంగా ఊడ్చే కార్మికులు వారు. నగరాన్ని శుభ్రపరిచేందుకు అర్థరాత్రి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, నడిరోడ్డుపై విధులు నిర్వహిస్తుంటారు. కానీ పండుగొచ్చినా వారికి పస్తులు తప్పటం లేదు. భాగ్యనగరానికి క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు వచ్చేందుకు ముఖ్య కారుకులు వీరే.

07/27/2016 - 04:04

మేడ్చల్, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో విధిగా అందరూ భాగస్వామలు కావాలని తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహాయం, ఎంఇఓ బి. శ్రీ్ధర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కండ్లకోయ అనుబంధ గ్రామమైన సుత్తారిగూడలో సర్పంచ్ కందాడి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

07/27/2016 - 04:04

రాజేంద్రనగర్, జూలై 26: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రథమ ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రవీణ్‌రావును మంగళవారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

Pages