S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కలతోనే స్వచ్ఛమైన ఆక్సిజన్

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలు నాటాలని, తద్వారా మొక్కలు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేయటంతో దాన్ని పీల్చుకుని మనం అనేక వ్యాధుల బారిన పడుకుండా ఉంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సికిందరాబాద్‌లోని బోట్స్‌క్లబ్ వద్ధ గల యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కార్యాలయ ఆవరణలో మంగళవారం మంత్రులు టి.పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలను పెంచి, అటవీ ప్రాంత విస్తరణను పెంచాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పీల్చుకుని అలర్జీ, ఆస్తమా వంటి అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని వివరించారు. పూర్వ కాలంలో అశోకుడు పెద్ద ఎత్తున చెట్లు నాటారని, మళ్లీ అంతటి బృహాత్తర కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టారన్నారు. ఒక ఇంటికి కనీసం పది మొక్కలైనా నాటితే నిర్ధేశించిన లక్ష్యం పూర్తవుతోందని, ఆ దిశగా అందరూ భాగస్వాములు కావాలని అలీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆబ్కారీ, యువజన క్రీడా శాఖా మంత్రి టి. పద్మారావు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా, అంకితభావంతో చేపట్టాలని సూచించారు. యువజన సర్వీసుల శాఖకు లక్ష మొక్కలు నాటాలని నిర్దేశించగా ఇప్పటి వరకు 2.70లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించారన్నారు.
కేవలం మొక్కలను నాటడమే గాక, వాటిని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అటవీ సంపదను పెంచుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రజలంతా ముందుకొచ్చి భాగస్వాములు కావాలన్నారు. వృక్ష సంపద ఆవశ్యకతను తెలియజేస్తూ చక్కటి గేయాన్ని ఆలపించిన చిన్నారి రితికను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ కార్యదిర్శ జయేష్ రంజన్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, యువజన సంక్షేమ శాఖ కమిషనర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, ఆర్టీవో రఘురాం శర్మ, నెహ్రు యువకేంద్రం జోనల్ డైరెక్టర్ రిషిపాల్‌సింగ్, హైదరాబాద్ జిల్లా యువజన సంక్షేమాధికారి మోతీలాల్, నెహ్రు యువజన కేంద్రం కో ఆర్డినేటర్ రాచర్ల వెంకటేశంతో పాటు తెలంగాణ మెజీషియన్ల సంఘం తరపున సామల వేణు, ఎన్‌సిసి, ఎన్‌వైకే కెడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.