S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:19

ఇంద్రకీలాద్రి, జూలై 26: కృష్ణా పుష్కరాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక పనులను పూర్తి చేసి ఉత్సవాలు ముగిసిన వెంటనే శాశ్వత పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పి మాణిక్యాలరావువెల్లడించారు. మంగళవారం ఉదయం మంత్రిని కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ దుర్గగుడిలో చేసిన ఏర్పాట్లను వివరించారు.

07/27/2016 - 04:18

విజయవాడ, జూలై 26: వికలాంగులు, క్యాన్సర్ పేషెంట్ల కోసం విజయవాడ వైస్క్రీన్స్ సంస్థ సరికొత్తగా ఆలోచించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న మినీ ఫ్లెక్స్‌లను నిర్మించిన వైస్క్రీన్స్ సంస్థ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే వికలాంగులకు, క్యాన్సర్ పేషెంట్ల కోసం సినిమా ప్రదర్శించటం. వైస్క్రీన్స్‌లో రెండు రోజులపాటు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

07/27/2016 - 04:18

విజయవాడ, జూలై 26: బందరు పోర్టు, మడా పేరుతో సుమారు 36వేల ఎకరాల భూ సమీకరణకు జారీచేసిన జీవో 185ను తక్షణమే ఉపసంహరించాలని, 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరామ్, వంగల సుబ్బారావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బందరు పోర్టుకు 2వేల ఎకరాలు సరిపోతాయని పోర్టు అధికారులు నిర్ధారించారు.

07/27/2016 - 04:16

నంద్యాల టౌన్, జూలై 26: ద్విచక్ర వాహనానికి కారు తగిలించాడన్న కోపంతో ఓ డాక్టర్‌ను నలుగురు యువకులు రాళ్లతో కొట్టి చంపిన అమానుష కాండ వెలుగుచూసింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి (40) గాజులపల్లె పిహెచ్‌సిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

07/27/2016 - 04:16

సికింద్రాబాద్, జూలై 26: నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అలాగే సాయంత్రం కూడా నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. కాగా, చిన్నపాటి వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

07/27/2016 - 04:15

వికారాబాద్, జూలై 26: ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యనందించాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని ధన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, సమీపంలోని యజ్ఞ ఫౌండేషన్ అనాథ విద్యార్థులకు ఎస్‌కెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు అందజేశారు.

07/27/2016 - 04:15

ఖైరతాబాద్, జూలై 26: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 29న అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు జాతీయ మాలల ఐక్య వేదిక ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఆవుల బాలనాథం, సత్యనారాయణ, బాలకిషన్ మాట్లాడుతూ అగ్రకులాలే వర్గీకరణ చిచ్చు రాజేశాయని మండిపడ్డారు.

07/27/2016 - 04:14

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సరిగ్గా పనిచేయని వారికి ఇకపై వార్షిక ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. ప్రమోషన్లు రావాలన్నా పనితీరుకు ‘గుడ్’, ‘వెరీ గుడ్’ అన్న కొలమానాలకు చేరుకోవలసి ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివి.

07/27/2016 - 04:14

ఘట్‌కేసర్, జూలై 26: హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో విజయవంతం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధి అన్నోజిగూడ గ్రామంలోని శ్రీ సాయిశంకర గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో మంగళవారం జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలను నాటారు.

07/27/2016 - 04:14

విజయవాడ, జూలై 26: రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్ల కమీషన్‌ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు 20 రూపాయలు కమీషన్ చెల్లిస్తున్నారు. దీన్ని 70 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన ప్రభుత్వ ఖజానాపై 77 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం ఐదు వేల రూపాయలు కమీషన్ అందుకుంటున్న రేషన్ డీలర్లు ఇకపై ఎనిమిది వేల రూపాయల వరకూ అందుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Pages