S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:33

ఏలూరు, జూలై 26: వనం-మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 29వ తేదీన పదిలక్షల మొక్కలు నాటేందుకు ఒక ప్రణాళిక అమలుచేస్తున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో మంగళవారం మండలస్ధాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

07/27/2016 - 04:32

కుకునూరు, జూలై 26: కుకునూరు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన వారందరికీ ఆర్‌ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామని సబ్‌కలెక్టర్ షాన్‌మోహన్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ అపోహ పడొద్దని ఆయన కోరారు.

07/27/2016 - 04:32

యలమంచిలి, జూలై 26: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం చింతదిబ్బ గ్రామంలో వరినాట్లు తీసి అసలు సిసలైన రైతుగా మారారు. స్వచ్ఛమేవ జయతేలో భాగంగా వరినాట్లు తీసి కట్టలు కట్టి నాట్లువేసే మహిళలకు ఆయన అందించారు. అర ఎకరం భూమి నాట్లు వేసే వరకు ఆయన చేలోనే ఉన్నారు.

07/27/2016 - 04:31

యలమంచిలి, జూలై 26: ఈ నెల 31 నుంచి గోదావరి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అధికారులు పుష్కర రేవులను పరిశీలిస్తున్నారు. గతేడాది పుష్కరాలకు ఏర్పాటుచేసిన పుష్కర రేవులు ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. అబ్బిరాజుపాలెంలో నిర్మించిన మరుగుదొడ్లు గత పుష్కరాలైన వెంటనే కూలిపోయాయి. మండలంలో ఉన్న పుష్కరరేవులన్నీ కూడా అధ్వాన్నస్థితిలోనే ఉన్నాయి.

07/27/2016 - 04:29

జగ్గయ్యపేట రూరల్, జూలై 26: మండలంలోని ముక్త్యాలలో 15రోజుల ముందుగానే పుష్కర సందడి నెలకొంది. సూర్యకాలమాన ప్రకారం మంగళవారం నుండే పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని ఆ సమయంలో పుష్కర స్నానాలు మంచిదని పండితుల నిర్ణయం మేరకు బలుసుపాడు గురుధామ్ వ్యవస్థాపకులు తాత్వికులు గెంటేల వెంకట రమణ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానం చేపట్టారు.

07/27/2016 - 04:29

మచిలీపట్నం, జూలై 26: ప్రస్తుత ఖరీఫ్ సాగులోనూ గత చేదు అనుభవాలు తప్పేట్లు కనిపించడం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా డెల్టాలో ఖరీఫ్ సాగు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అరకొరగా విడుదల చేసిన గోదావరి జలాలు రైతన్నలను ఏమాత్రం ఆదుకోలేకపోతున్నాయి. దీంతో ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. తొలకరిలో పడ్డ వర్షాలకు మురిసిపోయిన రైతులు నారుమడులు పోశారు.

07/27/2016 - 04:28

అవనిగడ్డ, జూలై 26: మండల పరిధిలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా 30వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హరితాంధ్రప్రదేశ్‌గా రూపొందించేందుకు పర్యావరణ సమతుల్యత కోసం విధిగా మొక్కలు నాటాలన్నారు. ఇందుకు ప్రజలను చైతన్యపర్చటంలో అధికారులు కృషి చేయాలన్నారు.

07/27/2016 - 04:27

తిరువూరు,జూలై 26: ప్రముఖ సీనియర్ న్యాయవాది కొత్త వెంకటేశ్వరరావు(58) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జంట థియేటర్ల సెంటర్‌లోని తన నివాసంలోని వంటగదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండగా కనుగొన్నారు. గతంలో ఈయన ఎజిపిగా, తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవీతో పాటు బార్‌లో పలు కీలక పదవులు అలంకరించారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

07/27/2016 - 04:26

మచిలీపట్నం, జూలై 26: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ఏమాత్రం ముప్పు రాకుండా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఏలూరు రేంజ్ పరిధిలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్‌ల వద్ద తీసుకోవల్సిన జాగ్రత్తలు, బందోబస్తుపై సూచనలు చేశారు.

07/27/2016 - 04:26

న్యూఢిల్లీ,జూలై 26: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ఆర్థిక అంశాలతో కూడుకున్నది కాబట్టి ఓటింగ్ సాధ్యం కాదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

Pages