S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:25

చాట్రాయి, జూలై 26: పొట్టకూటికోసం బోర్లు వేస్తు జీవనం సాగిస్తున్న వ్యక్తి బోరువేసే రాడ్లు కిందపడి మృత్యువాత పడిన సంఘటన బుధవారం చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది.

07/27/2016 - 04:24

అవనిగడ్డ, జూలై 26: కృష్ణా పుష్కరాలకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ తెలిపారు. మంగళవారం దివి డివిజన్‌లోని పుష్కర ఘాట్లలో ఏర్పాట్లను ఆయన పరిశీలించేందుకు వచ్చారు. ఈసందర్భంగా కొత్తపేటలోని పుష్కరఘాట్‌ను పరిశీలించి భద్రతపై తగిన సూచనలు చేశారు. పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు.

07/27/2016 - 04:23

పెదపారుపూడి, జూలై 26: విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం వానపాముల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే నందిగామ మండలం పెద్దవరం గ్రామానికి చెందిన కట్టా జయరాజు(48) కూలి పనుల కోసం బృందంతో వానపామలు వచ్చారు.

07/27/2016 - 04:22

మోపిదేవి, జూలై 26: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదా కుమారి ఉత్సవాలను ప్రారంభించారు. కె ఫణి కుమార్ శర్మ ఆలయ సంప్రోక్షణ గావించారు. అనంతరం ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గణపతి పూజ నిర్వహించారు.

07/27/2016 - 04:21

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 26: ప్రభుత్వం రేషన్ డీలర్ల కోరిక తీర్చింది. ఎప్పటి నుంచో రేషన్ షాపుల నుంచి కమిషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంగా మంగళవారం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పుష్కరాల కారుకగా వారికి ప్రభుత్వం రేషన్ షాప్స్ డీలర్స్ కమిషన్ పెంచడంతో ప్రభుత్వంపై 77.44కోట్లు పడనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 50శాతం వరకు నిధులు దీనికి ఇవ్వనుంది.

07/27/2016 - 04:21

విజయవాడ, జూలై 26: కృష్ణా పుష్కరాలు 2016 నేపథ్యంలో ఆగస్టు 12 నుండి 23 వరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఒక స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంటుందని పుష్కరాల ప్రత్యేకాధికారి బి.రాజశేఖర్, కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. స్థానిక పుష్కర కమాండ్ కంట్రోల్ రూం నందు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చేపడుతున్న కృష్ణా పుష్కరాల 2016 డేటాపై మంగళవారం సమగ్రంగా చర్చించారు.

07/27/2016 - 04:21

ఇంఫాల్, జూలై 26: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల(44) తన 16 సంవత్సరాల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించటానికి నిర్ణయించుకున్నారు. ఆత్మహత్యాయత్నం కేసులో జైలులో ఉన్న ఆగస్టు 9న దీక్ష విరమించటానికి నిర్ణయించుకున్నట్లు స్థానిక కోర్టులో హాజరవటానికి మంగళవారం వచ్చిన సందర్భంగా తెలిపారు. ‘నేను దీక్ష విరమిస్తాను. రాజకీయాల్లో చేరుతున్నాను.

07/27/2016 - 04:20

విజయవాడ, జూలై 26: కృష్ణా పుష్కరాల సందర్భంగా పోలీసు శాఖ రాత్రి, పగలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పుష్కర బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

07/27/2016 - 04:20

విజయవాడ, జూలై 26: ఆగస్టు 12 నుండి 23 వరకు ప్రతి నిత్యం లక్షలాది మంది ప్రజలు కృష్ణా పుష్కరాల పుణ్యస్నానం ఆచరించేందుకు రావడం జరుగుతుందని అందుకనుగుణంగా సెల్‌ఫోన్ సిగ్నల్స్, టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. స్థానిక కలెక్టర్ ఛాంబరులో మంగళవారం బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

07/27/2016 - 04:19

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 26: చంద్రబాబు నాయుడు పాలనలోనే ఉద్యోగాలు, ఉపాధిని ఇతోధికంగా కల్పించడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం ఐలాపురం కనె్వన్షన్ సెంటర్‌లో చంద్రన్న పాలన - నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే అంశంపై సదస్సు జరిగింది.

Pages