S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొన్నాలను అడ్డుకున్న టిఆర్‌ఎస్ వర్గాలు

తుర్కపల్లి, జూలై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరమార్శించేందుకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బృందాన్ని మెదక్ జిల్లా కొండపాక మండలం లింగాపురం వద్ధ పోలీసులు అడ్డుకుని బృందంలోని మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం 2గంటల నుండి 6-30వరకు ఆయనను పోలీస్ స్టేషన్‌లో నిర్భంధించారు. సాయంత్రం పొన్నాలను పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయగా ఆయన బయటకు వస్తున్న సమయంలో అక్కడే అప్పటికే మోహరించి ఉన్న టిఆర్‌ఎస్ నాయకులు పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయనను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. మల్లన్న సాగర్‌ను వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకోగా పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టి పొన్నాలను సురక్షితంగా పంపించారు. ఈ సందర్భంగా పొన్నాల విలేఖరులతో మాట్లాడుతు సీఎం కెసిఆర్ ప్రభుత్వం గడిల పాలన సాగిస్తుందని రాజరికపు పోకడలతో నిరంకుశంగా ఏకపక్షంగా అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి, ఫైరింగ్ జరిపించడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్, జూరాల వంటి ప్రాజెక్టుల నిర్మాణ తీరును విస్మరించి నేడు గుగూల్ వ్యవస్థతో రీడిజైన్లు చేస్తు డిపిఆర్‌లు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తు భూసేకరణ చేస్తు కెసిఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిల్వ 50టిఎంసిలు అవసరం లేదన్నారు. కెసిఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే 2013్భసేకరణ చట్టం వచ్చిందన్నారు. 123జీవోతో నిర్వాసితులకు కెసిఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని 2013చట్టంతోనే నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. డిసిసి అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యరావు, నాయకులు తంగళ్లపల్లి రవి, పొత్నాక్ ప్రమోద్‌కుమార్, నితీష్‌రావు, రాహుల్‌రెడ్డి, బిక్యూనాయక్, ఎంపిపి బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, బాలకృష్ణ, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.