S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 00:32

నాగార్జునసాగర్, జూలై 26: నాగార్జునసాగర్‌లో పైలాన్, హిల్‌కాలనీ వాసులకు గత రెండురోజులుగా తాగునీటి అవసరాలకై ఆకుపచ్చ రంగులో ఉన్న నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే గతంలో పలుమార్లు తాగునీటితోపాటు తోక పురుగులు, క్రిమికీటకాలు కూడా నీటితోపాటు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందారు.

07/27/2016 - 00:32

మఠంపల్లి, జూలై 26: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ కన్వీనర్ల సమావేశం బుధవారం మట్టపల్లి బ్రాహ్మణ సత్రంలో నిర్వహిస్తున్నట్లు హుజూర్‌నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాపుమంచి చంద్రశేఖర్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. ఈసమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గంగు భానుమూర్తితోపాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని, జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ కన్వీనర్లు, కోకన్వీనర్లు హాజరుకావాలన్నారు.

07/27/2016 - 00:31

నల్లగొండ టౌన్, జూలై 26 : ఈ నెల 31న నిర్వహించే టిఎస్‌పిఎస్‌సి కానిస్టేబుల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లకు సిద్దం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ పరీక్షలను అబ్జెక్టీవ్ టైపులో నిర్వహించడం జరగుతుందని తెలిపారు.

07/27/2016 - 00:06

‘‘మన స్కూల్లో ఎడ్మిషన్ కోసం వచ్చారట సార్’’ అన్నాడు ప్రిన్సిపాల్‌తో అటెండర్.
‘‘కూర్చోండి’’ మమ్మల్ని చూసి అన్నారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘నమస్తే సార్. వీడు మా అబ్బాయి వినీత్’’ అని చెబుతూనే వినీత్ వైపు తిరిగి ‘‘సార్‌కి నమస్కారం చెప్పరా’’ అని చెవి దగ్గర గొణిగాను.
రెండు చేతులూ జోడించాడు వినీత్.
‘‘ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివావు వినీత్?’’ నవ్వుతూ అడిగారు ప్రిన్సిపాల్.

07/26/2016 - 23:59

‘‘ఒరేయ్ విజయ్! ఇది చాలా పెద్ద కంపెనీ. మంచి జీతం. మరిచిపోకుండా ఇంటర్వ్యూకి వెళ్లు. సర్ట్ఫికెట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిగ్గా చూసుకో’’ గోపాలరావు కొడుక్కి పదేపదే జ్ఞాపకం చేయసాగాడు.

07/26/2016 - 23:57

ఆత్మలో మమతల వనం నవనవలాడింది అక్షరామృత ఆస్వాదనలో మానవత్వపు విశ్వరూపం ఆవిష్కృతమైంది. సర్వులకు చిరునవ్వు కన్నీళ్లు ఒక్కటే యని ఆ భావ సమైక్య మైకమే నన్ను మనిషిని చేసింది. అంటూ బుద్ధికి జల్లెడ పట్టే జన హృదిని స్పృశించే ఏభైఏడు కవితల్ని ‘నైవేద్యంగా’ ఆవిష్కరించారు శ్రీమతి ఎస్ సుమత్రాదేవి. ఎంతో జీవితానుభవం గలిగిన చేయి తిరిగిన రచయిత్రిగా తన రెండవ కృతిగా మధుర మంజుల, భావరంజిత, కావ్యాన్నందించారు.

07/26/2016 - 23:51

సిటీలోకెల్లా పెద్ద పారిశ్రామికవేత్త నిరంజన్‌గారి కొడుకు పదహారవ పుట్టినరోజు వేడుకలు వారి తోటలోని ఇంట్లో ఘనంగా జరుపుతున్నారు. ఇల్లంతా తోటలోని రంగురంగు పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ సాయంత్రం నగరంలోని పెద్దపెద్ద కుటుంబాలవారు తమ భార్యాపిల్లలతో వస్తున్నారు. వారబ్బాయి మహేష్ స్నేహితులు, ప్రముఖులైన వారి కంపెనీ ఉద్యోగులు వస్తున్నారు. బంధువులంతా ముందురోజే వచ్చి ఇల్లంతా సందడి చేస్తున్నారు.

07/26/2016 - 23:48

‘బాల మృణాళతంతువును బాఱని నీకుచమధ్యమందు నీ
లాలకలగ్నమైన హృదయాంబు జమున్ మఱలింపఁజాలనో
బాల! ధనంజయాత్మజుఁడు వైరులు పన్నిన తమ్మి మొగ్గరం
బాలము సేయఁజొచ్చినటులయ్యెను వెల్వడనేర్పు చాలమిన్’

07/26/2016 - 23:47

ప్రతి సింధువు వేలకోట్ల వర్షపు నీటి బిందువులకు మూలమైతే
కురిసే ప్రతి వర్షపు బిందువు పుడమితల్లికి ఆయువుపట్టే!
ఒడిసి పట్టే ప్రతి వర్షపు బొట్టే ప్రగతికి తొలిమెట్టైతే
నీటి పొదుపుకి వేసే ప్రతి మెట్టు పచ్చదనానికి ప్రాణం పోసినట్టే!
పట్టుపట్టు ప్రతి బొట్టు వెయ్యికోట్ల జీవుల దాహం తీరేట్టు..

07/26/2016 - 23:43

అన్నయ్య
కవితా సంకలనం
పుటలు 64,
వెల రూ. 40.
ప్రతులకు:
- గబ్బిట దుర్గాప్రసాద్,
అధ్యక్షులు, సరసభారతి,
2-405, శివాలయం వీధి,
రాజాగారి బంగ్లా వద్ద,
ఉయ్యూరు, కృష్ణా జిల్లా.
**

Pages