S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 04:30

ఖమ్మం(ఖిల్లా), జూలై 25: తెలంగాణ మున్సిపల్ ప్రాజెక్టు కింద రూపొందించిన ఖమ్మం కార్పొరేషన్ బేస్‌మ్యాప్‌ను డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మణ్‌గౌడ్ స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్న హద్దుల ప్రతిపాదికన బేస్‌మ్యాప్ 120షీట్లను రూపొందించడం జరిగిందన్నారు.

07/26/2016 - 04:29

ముదిగొండ, జూలై 25: హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా వాటిని సంరక్షించటంలో అధికారులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ముదిగొండ మండలంలోని వెంకటాపురం, గంధసిరి గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో వన నర్సరీ, గంధసిరిలోని మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, రహదారుల వెంట నాటిన మొక్కలను పరిశీలించారు.

07/26/2016 - 04:28

ముదిగొండ, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై జరిపిన పోలీసుల కాల్పులు, లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం ముదిగొండలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఎం డౌన్‌డౌన్ అంటూ పోలీసు జులుం నశించాలని మంత్రి హరీష్‌రావు వెంటనే రాజీనామ చేయాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ముదిగొండ బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

07/26/2016 - 04:27

ఖమ్మం(క్రైం), జూలై 25: హరితహారంలో మొక్కలను నాటడమే కాకుండా వాటిని ప్రభుత్వ ఆస్తిగా భావించి ప్రతి మొక్కకు లెక్కచెప్పాలని జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసీం అన్నారు. సోమవారం స్థానిక సెయింట్‌మేరిస్, పోలీస్‌కోర్టర్స్, ఇందిరానగర్ మసీద్ ఆవరణంలోని ఖబరస్థాన్ చుట్టూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం ఏడు లక్షల పదివేల మొక్కలు నాటడం జరిగిందన్నారు.

,
07/26/2016 - 04:15

నల్లగొండ, జూలై 25: జిల్లాలో ఆగస్టు 12 నుండి 23 వరకు జరుగనున్న కృష్ణా నది పుష్కరాల సందర్భంగా నది పరీవాహకం వెంట ఉన్న ప్రసిద్ధ ఆలయాలకు పుష్కర హంగులద్దాలన్న సర్కార్ యోచన సకాలంలో సిద్ధించడం కష్టతరంగా కనిపిస్తోంది. కృష్ణా పుష్కర స్నానాల అనంతరం భక్తులు దగ్గర్లో ఉన్న దేవాలయాలను దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు.

07/26/2016 - 04:15

శామీర్‌పేట, జూలై 25: రోడ్డు ప్రమాదంలో సిఆర్‌పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన కళ్యాణ్ ధర్మరాజ్ (44) సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

07/26/2016 - 04:14

ఖైరతాబాద్, జూలై 25: తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం నాయకులు మహిపాల్‌రెడ్డి, మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బోదనేతర సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

07/26/2016 - 04:13

బేగంపేట, జూలై 25: నేను ప్రతి ఒక్కర్ని చల్లంగా చూస్తున్నా..అయినా నన్ను పట్టించుకోవటం లేదు..నాకు శాంతి జరగాలంటే రక్తతర్పణం చేయాలంటూ సికిందరాబాద్ బోనాల రంగంలో అవివాహిత స్వర్ణతల భవిష్యవాణి విన్పించారు. రక్తతర్పణం తనకోసం కోరుకోవటం లేదని తన చుట్టూ ఉన్న శక్తులను శాంతి చేసేందుకేనని చెప్పారు. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా రెండోరోజు కూడా సికిందరాబాద్‌లో భక్తుల కోలాహలం నెలకొంది.

07/26/2016 - 04:12

హైదరాబాద్, జూలై 25: మహానగరంలో పర్యావరణ పరిరక్షణ కోసం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కనీసం 84లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు సగం శాతం పూర్తయినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

07/26/2016 - 04:12

ఖైరతాబాద్, జూలై 25: నిర్బాందాలతో ప్రాజెక్టులు నిర్మించాలనుకోవడం సరికాదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంతోల్ల భూములు కోల్పోతున్న రైతులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు.

Pages