S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రైతులను ముంచి ప్రాజెక్టులా..? జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన

ఖైరతాబాద్, జూలై 25: నిర్బాందాలతో ప్రాజెక్టులు నిర్మించాలనుకోవడం సరికాదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంతోల్ల భూములు కోల్పోతున్న రైతులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ భూనిర్వాసితుల కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, సిపిఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రాజక్టుల నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పొతున్న వారికి సరైన న్యాయం జరగాలని అడుగుతున్నారని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అవసరం లేదని నిపుణులు చెబుతున్నా కెసిఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 14 గ్రామాలకు చెందిన ప్రజలు భూములు కోల్పోతున్నారని, ఆందోళనకు గురైన వారు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, దానిని కూడా అణిచివేయాలను కోవడం దారుణమన్నారు. నిర్వాసితులంతా కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ల మీదికి వస్తుంటే ప్రతిపక్షాల కుట్రని అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు కోరుకున్న విధంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడమే తప్పని, 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం కావాలనుకునే వారు ఎవరికి మొరపెట్టుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. లాఠీచార్జ్ ఘటనపై నిజనిర్ధాణ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రైతులను కొట్టిన డిఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూనిర్వాసితులకు మద్దతుగా ఉద్యమిస్తామని చెప్పారు.