S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 04:41

న్యూఢిల్లీ, జూలై 25: దేశంలో అత్యంత సంపన్న వర్గంగా భావించే పార్శీ జనాభా గత పదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 2001లో 69వేలపై చిలుకు ఉన్న ఈ జనాభా 2011 నాటికి 22శాతం తగ్గి 57వేలకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో పార్శీలు కేవలం వందల సంఖ్యలోనే ఉన్నట్టు తాజా గణాంక వివరాలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీలో కనిష్ఠ స్థాయిలో పార్సీలు కేవలం 221 మాత్రమే.

07/26/2016 - 04:41

జగ్గయ్యపేట రూరల్, జూలై 25: రాష్ట్ర ఫ్రభుత్వం ఈ నెల 29న వన మహోత్సవంలో భాగంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకుందని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కోరారు. సోమవారం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ స్థాయి సమావేశం వత్సవాయి ఎండిఒ జయచంద్ర అధ్యక్షతన జరిగింది.

07/26/2016 - 04:40

మచిలీపట్నం, జూలై 25: రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ ప్రాంత రైతులతో రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడి రైతులను చైతన్యవంతం చేస్తామని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.

07/26/2016 - 04:40

బీజింగ్, జూలై 25: భారత్‌లో ఉంటున్న ముగ్గురు తమ పౌరులకు వీసా పొడిగింపును తిరస్కరించటంపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్ తమపై ప్రతీకారం తీర్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది.

07/26/2016 - 04:39

మచిలీపట్నం, జూలై 25: బందరు ఓడరేవు నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు గత రెండు రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ జివో విడుదల చేసిన ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన 4వేల 636 ఎకరాల భూముల సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం.

07/26/2016 - 04:39

న్యూఢిల్లీ, జూలై 25: పొకెమాన్ గొ గేమ్ జ్వరం హైరేంజ్‌కి చేరుకుంది. పర్ఫార్మెన్స్ కన్సార్టియంకు చెందిన వాలంటీర్లు ఆదివారం ఇండియాగేట్ వద్ద దాదాపు రెండున్నర గంటలపాటు పొకెమాన్ వాక్ నిర్వహించి అరుదైన డిజిటల్ పురుగులను పట్టుకునే కార్యక్రమాన్ని శిక్షకులతో నిర్వహించారు. ‘పొకె హంట్ ఇండియాగేట్ దగ్గర 5గంటలకు మొదలైంది. వీలైనన్ని పొకె బాల్స్‌ను సేకరించేందుకు ఆ ప్రాంతంలో పొకె స్టాప్స్ ఉన్నాయి.

07/26/2016 - 04:38

మచిలీపట్నం, జూలై 25: జిల్లా ప్రజల చిరకాల వాంఛ బందరు ఓడరేవు నిర్మాణం తథ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. త్వరలోనే ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పుల్లారావు అధ్యక్షతన బందరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది.

07/26/2016 - 04:38

న్యూఢిల్లీ, జూలై 25: పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌ను వీడియో తీసిన సంఘటనపై జరుగుతున్న దర్యాప్తు పూర్తయ్యేవరకు లోక్‌సభకు హాజరుకావద్దని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్‌ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించారు. అయితే త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో తన గళాన్ని నొక్కేసేందుకే బిజెపి, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మాన్ ఆరోపించారు.

07/26/2016 - 04:36

వాషింగ్టన్, జూలై 25: ప్రపంచ వాణిజ్యసంస్థ దారుణంగా విఫలమైన వ్యవస్థ అని, తాను అధ్యక్షుడిగా ఏన్నికైతే అమెరికాను అందులోంచి బయటకు తీసుకువస్తానని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఉత్పాదక కార్యకలాపాలను విదేశాలకు తరలిపోయే కంపెనీలపై 30శాతం దిగుమతి సుంకాన్ని కూడా విధిస్తామని వెల్లడించారు.

07/26/2016 - 04:31

కొత్తగూడెం, జూలై 25: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పివికె-5ఇంక్లైన్ భూగర్భగనిలో రెండువారాలు శ్రమించిన ఫలితంగా విష వాయువుల లీకేజీ అదుపులోకి వచ్చింది. సోమవారం భూగర్భగనిలో సీల్‌వాల్స్ నిర్మించడానికి అవసరమైన మెటీరియల్‌ను పంపిస్తున్నారు.

Pages