S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 03:33

గుంటూరు, డిసెంబర్ 8: విద్యార్థి దశ నుండే మెడికోలు గ్రామాల్లో పర్యటించి ప్రజారోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామన్నారు.

12/09/2016 - 03:32

చిత్తూరు, డిసెంబర్ 8: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణను పూర్తిగా అటవీశాఖకే అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు డిజిపి సాంబశివరావు తెలిపారు. గురువారం సాయంత్రం చిత్తూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కొంత వరకు తగ్గిందని ఇందుకోసం ప్రత్యేకంగా డిఐజి స్థాయిలో ఒక టాస్క్‌పోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

12/09/2016 - 03:32

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడి రుణం తీర్చుకుందాం’ ద్వారా విద్యాశాఖకు వివిధ రూపాల్లో రూ.8.38 కోట్లు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వచ్చాయని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి శ్రీనివాసులు చెప్పారు. చిన్నప్పుడు మనం చదువుకున్న బడి అమ్మ ఒడితో సమానమని, నడిచొచ్చిన దారిని మరువకుండా మనకు వీలైనంతలో ఆ బడికేం చేయగలమో అలోచించాలని పిలుపునిచ్చారు.

12/09/2016 - 03:31

కవిటి, డిసెంబర్ 8: పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు తన బ్యాంకు ఖాతాలో పింఛన్ సొమ్ము జమ కాలేదని తెలిసి మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో బొరివంకలో చోటుచేసుకుంది. మండలంలోని పాతవరఖ గ్రామానికి చెందిన బెహరా ఖగా(66) తన పింఛన్ సొమ్మును తీసుకునేందుకు బొరివంకలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుకు గురువారం ఉదయం వచ్చాడు.

12/09/2016 - 03:30

గుంటూరు, డిసెంబర్ 8: వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశ్రీపై చర్చకు సిద్ధమని ప్రకటించారని, ఈ విషయంపై బహిరంగ చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, సమయం, తేదీ చెబితే వస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

12/09/2016 - 03:30

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 8: నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు.

12/09/2016 - 03:29

భద్రాచలం, డిసెంబర్ 8: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు చెందిన పెద్ద నోట్లను మారుస్తూ గురువారం ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. దంతెవాడ జిల్లా భాంసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా కన్పించాడు. అతనిని సోదా చేయగా వెయ్యి రూపాయల నోట్లు రూ.1.10 లక్షలు దొరికాయి. మావోయిస్టులకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు కూడా లభ్యమయ్యాయి.

12/09/2016 - 03:16

న్యూఢిల్లీ, డిసెంబరు 8: అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొనున్నారు. న్యూయార్క్ నగరంలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న ఈ సమ్మేళనంలో హాజరయ్యేందుకు గురువారం నాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అమెరికాకు పయనమయ్యారు.

12/09/2016 - 03:15

న్యూఢిల్లీ, డిసెంబరు 8: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50 ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యునెస్కో పేర్కొన్నట్టు కేంద్రమానవ వనరుల సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు.

12/09/2016 - 03:14

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ టీచర్ల సర్వీసు రూల్స్‌ను మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్ళి కరికాల వలవన్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబు రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు.

Pages