S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 02:59

అమరావతి, డిసెంబర్ 8:ప్రఖ్యాత సినీ దర్శకుడు రాజవౌళికి అరుదైన ఆహ్వానం దక్కింది. ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్న అమరావతి నిర్మాణానికి సలహాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభ్యర్థించారు. రాజవౌళి నిర్మించిన బాహుబలి, అంతకుముందు మగధీర భారీ సినిమాల్లో అత్యంత ఆకర్షణీయమైన నగరాలను చూపించిన వైనం బాబును ఆకట్టుకుంది.

12/09/2016 - 02:58

పటమట, డిసెంబర్ 8: నగరంలో 120 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సెంట్ పీటర్స్ కథెడ్రల్‌ను కూల్చివేయాలన్న ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఉదయం చర్చి వద్ద క్రైస్తవులు ఆందోళన నిర్వహించారు.

12/09/2016 - 02:58

విజయవాడ, డిసెంబర్ 8: తమిళనా డు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అంత్యక్రియలు శాస్త్ర విరుద్ధంగా జరి గాయని, శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ జ్యోతిష్య నిపుణు లు, ములుగు రామలింగేశ్వర వరప్రసా ద్ అభిప్రాయపడ్డారు. అంతిమ సం స్కారాన్ని సహచరురాలు శశికళ చేప ట్టడం సరైనది కాదన్నారు.

12/09/2016 - 02:56

విజయవాడ, డిసెంబర్ 8: నిడమానూరులో మెట్రోరైలు డిపో నిర్మాణానికి గుర్తించిన భూములకు నష్టపరిహారం న్యాయబద్ధంగా చెల్లించేలా జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఇన్‌చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు రైతులకు హామీ ఇచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మెట్రోరైలు డిపో నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న నిడమానూరు వాసులతో సమావేశం నిర్వహించారు.

12/09/2016 - 02:48

హైదరాబాద్, డిసెంబర్ 8: ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న జిహెచ్‌ఎంసి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏటా ఆర్టీసికి రూ. 273.38 కోట్లు చెల్లించలేని పరిస్థితులున్నాయని, ఆర్టీసికి జిహెచ్‌ఎంసి నిధులు కేటాయించేది లేదని జిహెచ్‌ఎంసి స్థారుూ సంఘం తీర్మానించింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్థారుూ సంఘం సమావేశం జరిగింది.

12/09/2016 - 02:48

హైదరాబాద్, డిసెంబర్ 8: మహానగరంలో అర్దాకలితో అలమటించే వారికి మధ్యాహ్నం పూట పెట్టడన్నం పెట్టాలన్న మహాసంకల్పంతో జిహెచ్‌ఎంసి ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 5 భోజన పథకాన్ని మున్ముందు మరింత విస్తరించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బోరబండలో కొత్తగా ఏర్పాటు చేసిన రూ. 5 భోజనం పంపిణీ కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ.

12/09/2016 - 02:46

ఘట్‌కేసర్, డిసెంబర్ 8: వృద్ధురాలి కంట్లో కారం చల్లి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి దత్తాత్రేయనగర్‌లో గురువారం జరిగింది. చైన్‌స్నాచర్లను ప్రతిఘటించి మూడు తులాల బంగారు గొలుసులో రెండు తులాలను కాపాడుకున్న వృద్ధురాలి వివరాలు ఇలా ఉన్నాయి.

12/09/2016 - 02:42

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 8: నానక్‌రామ్‌గూడ ఘటనలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతులంతా దినసరి కూలీలే. మొన్న జూబ్లీహిల్స్‌లోని ఫిలిం క్లబ్, నిన్న కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఆర్చి, నేడు నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలి వలస కూలీల ప్రాణాలను బలిగొంది. విషాదకరమైన ఈ సంఘటన గురువారం రాత్రి తొమ్మిది గంటలకు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

12/09/2016 - 02:41

హైదరాబాద్, డిసెంబర్ 8: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని నెలరోజులు గడుస్తున్నా, సామాన్యుల కష్టాలు తొలగనేలేదు. గడిచిన ముప్పై రోజుల్లో నగరంలో ఇద్దరు వృద్దులు మృతి చెందగా, నగదు కొరత కారణంగా ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి.

12/09/2016 - 02:40

వికారాబాద్, డిసెంబర్ 8: కేబుల్ టివికి సెటప్ బాక్స్‌లు పెట్టుకోకపోతే జనవరి ఒకటో తేదీ నుండి ప్రసారాలు నిలిపివేస్తామని తెలంగాణ ఎంఎస్‌వో రాష్ట్రం అధ్యక్షుడు, బ్రైట్‌వే కమ్యూనికేషన్స్ ఎండి ఎం.సుభాష్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌జెం కంఫర్ట్‌లో ఏర్పాటు చేసిన వికారాబాద్ పట్టణ, పరిసర గ్రామాల్లో కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ రంగ డిజిటలైజేషన్, సెటప్‌బాక్స్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Pages