S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 8: దాదాపు 18 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 1998 డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూ చుక్కలు చూపిస్తోంది. 1998లో అర్హుల జాబితాను ప్రకటించి ఖాళీలు లేవనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని అప్పటి ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది. అప్పటి నుండి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వాలకూ, అధికారులకు పట్టడం లేదు.

12/09/2016 - 02:17

భీమునిపట్నం, డిసెంబర్ 8 : భక్తుల పాలిట భగవత్ స్వరూపంగా భాసిల్లిన సద్గురు శివానందమూర్తి 89వ జయంతి వేడుకలు భీమిలిలోని ఆనందవనంలో గురువారం ఘనంగా జరిగాయి. మార్గశిర శుద్ధ నవమినాడు జరుపుకునే గురూజీ జయంతి వేడుకలు ఆయన కుమారుడు బసవరాజు-రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ఆనందవనంలో గల ఉపన్యాస మందిరంలో గురూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

12/09/2016 - 04:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 8:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన కెసిఆర్ జైట్లీని కలిశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల గురించి ప్రత్యేకంగా గుర్తుచేసినట్లు తెలిసింది.

12/09/2016 - 01:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నగదు రహిత లావాదేవీల దిశగా కేంద్రం బలమైన అడుగు వేసింది. ప్రతి రంగంలోనూ కార్డు, ఆన్‌లైన్ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు, తాయిలాలు ప్రకటించింది. కార్డు ద్వారా చెల్లింపులు జరిపే వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం కీలక నిర్ణయాలు ప్రకటించారు.

12/09/2016 - 01:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణంతోపాటు అన్ని అనుమతులు లభించాయని కేంద్ర నీటిపారుదల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాలయన్ తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సభ్యుడు సీతారాం నాయక్ అడిగిన అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంలోని రామాలయం ముంపునకు గురవుతుందనే విషయం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.

12/09/2016 - 01:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 8:దేశ ప్రజలు డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీలు సాగించేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ సమావేశానికి ఆయన గురువారం అధ్యక్షత వహించారు. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా, వివిధ బ్యాంకుల సిఎండీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

12/09/2016 - 01:46

చెన్నై/తిరుపతి, డిసెంబర్ 8: ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారం చెన్నైలో టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసి సుమారు 120 కోట్ల రూపాయల విలువైన పాత, కొత్త నోట్లు, బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక స్టార్ హోటల్ రూమ్ సహా ఈ ముఠాకు చెందిన ఎనిమిది ప్రాంతాలపై అధికారులు దాడులు జరిపారు.

12/09/2016 - 01:43

విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా గురువారం విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ వివరాలను గురువారం ఇక్కడ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

12/09/2016 - 02:03

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 8: హైదరాబాద్ నానక్‌రాం గూడలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కుప్పకూలటంతో కనీసం పదిమంది మరణించినట్లు సమాచారం. పలువురు క్షతగాత్రులయ్యారు. బాధితుల్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం ఉండగా మిగతావారంతా విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.

12/09/2016 - 01:28

ఇంగ్లాండ్ తరఫున 19 మంది తమతమ కెరీర్ మొదటి టెస్టులోనే శతకాలను నమోదు చేయగా, వారిలో ఓపెనర్లు ఎనిమిది మంది. ఎడమచేతి వాటం ఆటగాడైన జెన్నింగ్స్ గత 50 సంవత్సరాల కాలంలో, తమ మొదటి టెస్టులో సెంచరీ చేసిన మూడో ఓపెనర్ కావడం విశేషం. ఇతని కంటే ముందు ఆండ్రూ స్ట్రాస్, అలస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. జెన్నింగ్స్ కంటే ముందు, 2009లో జొనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాపై ది ఓవల్ మైదానంలో సెంచరీ చేశాడు.

Pages