S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 03:14

తిరుపతి, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపడానికి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 100 అన్న క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.సప్తగిరి ప్రసాద్ వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో కూడా ఒక అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

12/09/2016 - 03:13

అచ్యుతాపురం, డిసెంబర్ 8: విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ పార్కుకు ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందిస్తామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. గురువారం బ్రాండిక్స్ పార్కును సందర్శించిన ఆయన మాట్లాడుతూ బ్రాండిక్స్ గార్మెంట్లు ప్రపంచ స్థాయిలో గల బ్రాండ్లకు ఎగుమతి చేయడం చాల ఆనందంగా వుందన్నారు.

12/09/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 8: అమెరికాకు చెందిన మిస్సోరి స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ప్రాజెక్టు మేనేజిమెంట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. అన్ని విభాగాలకు చెందిన వృత్తి నిపుణులకు వారి అవసరాలను తీర్చే విధంగా ఈ కోర్సు రూపుదిద్దుకుంది.

12/09/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 దరఖాస్తు గడువును డిసెంబర్ 15వ తేదీ వరకూ పొడిగించినట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి వై వి ఎస్ టి సాయి తెలిపారు. గత వారం రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్టు సాయి చెప్పారు.

12/09/2016 - 03:11

పోలవరం, డిసెంబర్ 8: అధునాతన యంత్రాలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతుంటే, నత్తనడకన జరుగుతున్నాయని ప్రతిపక్షనేత జగన్ విమర్శించడం తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గతంలో జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు పనులు దళారులకు అప్పగించి దోచుకున్నారన్నారు.

12/09/2016 - 03:11

కొత్తపేట, డిసెంబర్ 8: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేయాలని భావిస్తున్న తనను అనుమతి తీసుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గతంలో ఆయన విపక్ష నేతగా జరిపిన పాదయాత్రకు ఎవరి నుండి అనుమతి తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఆ అనుమతి పత్రాలు తనకు చూపితే, తాను అదేరీతిలో అనుమతి కోరతానన్నారు.

12/09/2016 - 03:03

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 8: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని గరాలదిబ్బ గ్రామంలో రూ.70లక్షలతో నిర్మించిన అంతర్గత రహదారులను ఆయన ప్రారంభించారు.

12/09/2016 - 03:02

తోట్లవల్లూరు, డిసెంబర్ 8: ప్రైవేట్ స్కూల్ బస్ వేగానికి ఓ చిన్నారి బలైన ఘటన గురువారం ఉదయం తోట్లవల్లూరు జెడ్‌పి రోడ్డులో జమ్మిచెట్టు వద్ద చోటు చేసుకుంది. మరో చిన్నారికి కాలు గాయంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. వివరాల్లోకి వెళితే కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వీరంకి శివనాగప్రసాద్, రమాదేవికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శివనాగప్రసాద్ తాపీ పని చేస్తుంటాడు. ఇటీవల అయ్యప్పమాల ధరించాడు.

12/09/2016 - 03:01

అవనిగడ్డ, డిసెంబర్ 8: ‘బడి రుణం’ తీర్చుకుందాం అంటూ పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గురువారం అవనిగడ్డ ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. మనం చదువుకోవాలి, బడి అమ్మ ఒడిలాంటిది. ముందు మనం స్పందిద్దాం, ఇతరులకు స్ఫూర్తినిద్దాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

12/09/2016 - 03:00

విజయవాడ, డిసెంబర్ 8: ఎపిఎస్ ఆర్టీసీలో కార్మిక వర్గానికి ఎంతో కీలకమైన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సిసిఎస్) ఎన్నికలకు సంబంధించి గురువారం సాయంత్రం నామినేషన్ల ఘట్టం ముగిసింది. 9మంది డైరెక్టర్లతో కూడిన పాలకవర్గం ఏర్పాటుకు రాష్టవ్య్రాప్తంగా 236 మంది ప్రతినిధులను ఎన్నుకోటం కోసం ఈ నెల 16న ఎన్నికలు జరుగబోతున్నాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13న పోటీదారుల తుది జాబితా వెలువరిస్తారు.

Pages