S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 00:54

జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం, జాతీయ ఎంపిక పరీక్షల్లో టాపర్లుగా నిలవడం కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల ఆధిపత్యాన్ని రుజువు చేస్తోంది. ఏదో ఒక సంవత్సరానికి అది పరిమితం కాకుండా ఏకంగా గత పదేళ్లుగా అన్ని ఎంపిక పరీక్షల్లోనూ, ప్రవేశపరీక్షల్లోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చూపుతున్నారు.

12/09/2016 - 00:52

‘‘అంతగా నవ్వొచ్చిన విషయం ఏంటో..? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. మాకు చెబితే మేమూ నవ్వుతాం..’’
‘‘అవినీతి తాట తీస్తా- ఇక అంతా ఆన్‌లైన్‌లోనే.. అని ప్రధానమంత్రి చెబుతున్నారు’’
‘‘దీనిలో నవ్వడానికేముంది..? 70 ఏళ్ల తరువాత దేశాన్ని ఒక మొనగాడు పాలిస్తున్నాడు. దానికి సంతోషపడాలి’’
‘‘అదేంటి వాజపేయిని, మోదీ రెండున్నరేళ్ల పాలనా కాలం కూడా కాంగ్రెస్‌లోనే కలిపేశావా? 70 ఏళ్ల లెక్క ఏంటి? ’’

12/09/2016 - 00:48

నల్లధనాన్ని నియంత్రించేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ దేశంలో నల్లధనాన్ని అంతం చేయడం అసాధ్యమని ఇదివరకే రుజువైంది. గతంలోనూ రెండు సందర్భాల్లో పెద్దనోట్లను రద్దు చేసినా నల్లధనం సమస్య సజీవంగానే ఉంది. అప్పట్లో పెద్దనోట్లను అత్యధిక శాతం ధనికులు వాడుకొనేవారు, దాచుకునేవారు. పెద్దనోట్లను గతంలో రద్దు చేసినపుడు సామాన్య జనం ఎలాంటి కష్టాలు పడలేదు.

12/09/2016 - 00:42

ముంబయి, డిసెంబర్ 8: గురువారం జరిగే ఐరోపా సెట్రల్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలో ఉద్దీపక చర్యలను కొనసాగించవచ్చన్న అంచనాలకు తోడు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌బిఐ హామీలు ఇచ్చిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలు ఆర్జించాయి.

12/09/2016 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఏడాదికి కోటిన్నరకన్నా తక్కువ టర్నోవర్ ఉంటే పన్ను చెల్లింపుదారులపై అధికారం పూర్తిగా తమకే ఉండాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ వల్ల కేంద్రం అధికారాలు తగ్గిపోతాయని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల బోర్డు (సిబిఇసి) చైర్మన్ నజీబ్ షా గురువారం అన్నారు.

12/09/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: టాటా గ్రూపులో అన్‌లిస్టెడ్ సంస్థ అయిన టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎల్) ఈ నెల 14వ తేదీన తమ వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని తొలగించాలంటూ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించేందుకు టిటిఎల్ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది.

12/09/2016 - 00:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకుని ఆదాయాన్ని పెంపొందించుకునేలా రైతులకు వీలుకల్పిస్తున్న ప్రభుత్వం తొలి విడతగా దేశంలోని పది రాష్ట్రాల్లో గల 250 మండీలను ఇ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించిందని, దీని ద్వారా 421 కోట్ల రూపాయల సరుకుల క్రయవిక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు.

12/09/2016 - 00:32

చెన్నై, డిసెంబర్ 8: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంకు తమ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకింగ్) (ఎఫ్‌సిఎన్‌ఆర్-బి) టర్మ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను సవరించింది.

12/09/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ టెలికామ్ మార్కెట్లో వాణిజ్య పరంగా సేవలను ప్రారంభించకముందే పెను సంచలనాలు సృష్టిస్టున్న రిలయన్స్ జియో ధాటికి మిగిలిన ఆపరేటర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం తమ ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న సేవలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రిలయన్స్ జియో కొద్ది రోజుల క్రితం మరో సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే.

12/09/2016 - 00:28

చెన్నై, డిసెంబర్ 8: ప్రయాణికులకు చౌకధరలో విమానయాన సేవలను అందిస్తున్న ‘స్పైస్‌జెట్’ విమానయాన సంస్థ తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి చెన్నై-రాజమండ్రి మార్గంలో ప్రతి రోజూ నేరుగా విమానాలను నడపనుంది. దీంతో తాము ప్రతి రోజూ రాజమండ్రికి నేరుగా విమానాలను నడుపుతున్న మెట్రో నగరాల్లో హైరరాబాద్ తర్వాత చెన్నై రెండవ నగరం అవుతుందని స్పైస్‌జెట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Pages