S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 00:02

చెన్నై, డిసెంబర్ 8: దశాబ్దాల పాటు అన్నాడిఎంకెకు తిరుగులేని అధినేత్రిగా కొనసాగిన జయలలిత ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి తదుపరి సారధి ఎవరన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. జయలలిత స్థాయిలో పార్టీని ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నేతలు పార్టీలో ఉన్నారా.. ఉంటే ప్రస్తుతం వారికున్న స్ధానం ఏమిటన్నదీ చర్చనీయాంశంగా మారింది.

12/08/2016 - 23:58

ఇస్లామాబాద్, డిసెంబర్ 8: ద్వైపాక్షిక చర్చల విషయంలో భారత్ లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ సమస్యకు ఫలవంతమైన పరిష్కారాన్ని సూచించే విధంగా చర్చలు జరిపేందుకు భారత్ ఏ మాత్రం చొరవ చూపించటం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం ఆరోపించారు. కాశ్మీర్ వివాదం పరిష్కారంలో అంతర్జాతీయ సమాజం కీలకపాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

12/08/2016 - 23:57

పెద్దనోట్లు రద్దుచేసి నెల రోజులైనా కొత్త నోట్లు తగినంతగా అందుబాటులోకి రాకపోవడంతో దేశవ్యాప్తంగా జనం నగదుకోసం బ్యాంకులు, ఏటిఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు. గురువారం ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌లోని
ఓ గ్రామంలో ఏటిఎం వద్ద నగదుకోసం వేచివున్న జనం

12/08/2016 - 23:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పదిహేను కొత్త కులాలను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ (ఎన్‌సిబిసి) 8 రాష్ట్రాలకు సంబంధించి 28 మార్పులు చేయాల్సిందిగా సిఫార్సు చేసింది. అస్సాం, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లకు స్థానం కల్పించారు.

12/08/2016 - 23:55

తిరువనంతపురం, డిసెంబర్ 8: శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి ప్రవేశించే మహిళలు చుడీదార్లు, సల్వార్ కమీజ్ వంటి వస్తధ్రారణ చేయడాన్ని కేరళ హైకోర్టు నిషేధించింది. కేవలం చీరలు, ధోతీ వంటి సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని సూచించింది.

12/08/2016 - 23:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలోని రైల్వే స్టేషన్లు, బస్సులు, మెట్రో స్టేషన్లలో పాత 500నోట్లు ఇక చెల్లవు. 10వ తేదీ తరువాత పాత 500 రూపాయల నోట్లను తీసుకోరని ప్రభుత్వం వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇంతకు ముందు రైల్వే కౌంటర్లు, ప్రభుత్వం రంగ బస్సు టికెట్లకు డిసెంబర్ 15 వరకూ అనుమతిస్తారని తెలిపారు. ఇప్పుడు దాన్ని డిసెంబర్ 10వరకు కుదించారు.

12/08/2016 - 23:53

చెన్నై, డిసెంబర్ 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఉపగ్రహాల ప్రయాణానికి సంబంధించి మరింత కచ్చితంగా సమాచారం సేకరించేందుకు కొత్త ప్రయోగం చేసింది. బుధవారం ప్రయోగించిన రిసోర్స్ శాట్ 2ఏ ఉపగ్రహంపై రెండు కెమెరాలు ఉంచారు. శాటిలైట్ ప్రయోగ సమయంలో మోటార్లు, ఉపగ్రహాలు, వేడి శకలాలు విడిపోవటంపై మరింత కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.

12/08/2016 - 23:49

గుంటూరు, డిసెంబర్ 8: గుంటూరు అర్బన్ పరిధిలోని సబ్ డివిజన్ల అధికారిక ప్రాంతపు హద్దుల్లో మార్పులు చేర్పులు అంశంపై అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి త్రిపాఠి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతమున్న సబ్ డివిజన్లలోని పోలీసుస్టేషన్ల సంఖ్య, గ్రామాలు, ప్రజల సంఖ్య, విస్తీర్ణం, సిబ్బంది పనిభారం తదితర విషయాలపై ఆరా తీశారు.

12/08/2016 - 23:48

గుంటూరు, డిసెంబర్ 8: గుంటూరు కేంద్రంగా ఇటీవల వెలుగుచూసిన కల్తీ కారం నిల్వలు ప్రజారోగ్యానికి ప్రమాదకరమైనవిగా రసాయన పరీక్షలలో తేలింది. రాష్టవ్య్రాప్తంగా విజిలెన్స్, మార్కెటింగ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి 39 రకాల శాంపుల్స్ సేకరించారు. నగరంలోని పలు కోల్డు స్టోరేజీలతో పాటు మిల్లులతో పాటు రోడ్ల వెంట విసిరేసిన 65వేల బస్తాల కల్తీ కారం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

12/08/2016 - 23:48

విజయపురిసౌత్, డిసెంబర్ 8: ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ సమీపంలో శుక్రవారం ఏర్పాటు చేస్తున్న అనుపు ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనుపుకు మధ్యాహ్నం 3.10గంటలకు ముఖ్యమంత్రి రానున్నారు.

Pages