S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 00:15

పోలవరం, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతీ సోమవారం నిర్మాణ పనులపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్, మూడవ సోమవారం నిర్మాణ ప్రాంతానికి వచ్చి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, వేగవంతమవ్వటానికి అన్ని చర్యలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నారన్నారు.

12/09/2016 - 00:15

భీమవరం, డిసెంబర్ 8: మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఆలయ ప్రాంగణంలో ఘర్షణకు దిగారు. ఈ విషయం తారస్ధాయికి చేరడంతో ధర్మకర్తల మండలి గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఛైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు.

12/09/2016 - 00:14

యలమంచిలి, డిసెంబర్ 8: పెద్దనోట్లు రద్దుచేసి నెల కావస్తున్నా యలమంచిలి, పోడూరు మండలాల్లో బ్యాంకు ఖాతాదారుల ఇబ్బందులు మాత్రం అలానే ఉన్నాయి. దీంతో నానాటికీ ఖాతాదారుల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. గురువారం యలమంచిలి ఎస్‌బిఐ వద్ద, పోడూరు మండలం కవిటం ఇండియన్ బ్యాంకు వద్ద ఖాదారులు ధర్నాకు దిగారు.

12/09/2016 - 00:14

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, 1000 నోట్లను రద్దుచేసి నేటికి 30 రోజులు గడుస్తున్నా ప్రజల చిల్లర కష్టాలు తీరలేదు. నెల రోజులుగా తెరుచుకోని ఎటిఎంలు పట్టణంలో అనేకం ఉన్నాయి. బ్యాంకుల్లో నగదు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి వారంలో పెన్షన్లు, జీతాలు పడినా డబ్బులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

12/09/2016 - 00:13

ద్వారకాతిరుమల, డిసెంబర్ 8: రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో శ్మశానవాటిక అభివృద్ధికి రూ.10 లక్షల నిధులను అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ పరిధిలో తక్కెళ్లపాడు, కప్పలకుంట గ్రామాల్లో జరిగిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

12/09/2016 - 00:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రతిపక్షం చేసిన గొడవ, గందరగోళం మూలంగా గురువారం కూడా రాజ్యసభ సక్రమంగా పని చేయలేదు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ వాదన వినిపించేందుకు అవకాశం లభించడం లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బాధ ఎవరు వింటారు అంటూ సమాచార శాఖ మంత్రి వెం.వెంకయ్యనాయుడు రాజ్యసభలో వాపోయారు. జీరో అవర్‌లో సభాధ్యక్షుడు హమీద్ అన్సారీతో ఈ అంశంపై వాదనకు దిగారు.

12/09/2016 - 00:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలని పట్టుపడుతున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు గురువారం కూడా లోక్‌సభను స్తంభింపజేశాయి. కాంగ్రెస్, టిఎంపిసి, వామపక్షాలకు చెందిన సభ్యులు పోడియంను చుట్టముట్టి ఎన్‌డిఏ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ లోక్‌సభను స్తంభింపజేశారు.

12/09/2016 - 00:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఒక వ్యక్తి చేసిన ఆర్థిక విధ్వంసంగా విపక్షాలు తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై గురువారం విరుచుకుపడ్డాయి. పెద్ద కరెన్సీని రద్దు చేసి నెలరోజులైన సందర్భంగా అన్ని విపక్షాల నేతలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు బ్లాక్‌డేను పాటించారు.

12/09/2016 - 00:07

చెన్నై, డిసెంబర్ 8: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జయను సమాధిచేసిన మేరినాబీచ్ ప్రాంతం కన్నీటిసాగరమైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి దివంగత నాయకురాలికి నివాళులర్పిస్తున్నారు. అమ్మ చనిపోయి గురువారానికి మూడు రోజులైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వౌన ప్రదర్శనలు జరిగాయి.

12/09/2016 - 00:04

కోల్‌కతా, డిసెంబర్ 8: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ తీసుకున్న చర్య ‘ఆర్థిక వ్యవస్థ విధ్వంసాని’కి దారితీసినందున ఆయన తక్షణమే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల ఉపసంహరణ వల్ల దేశ అభివృద్ధి, వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

Pages