S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రిజర్వ్ బ్యాంక్ బుధవారం జరిపిన ద్రవ్యపరపతి విధానం సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ కొత్త సంవత్సరంలో 25-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలు లేకపోలేదని ఓ తాజా నివేదిక అభిప్రాయ పడింది.

12/09/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాలు తక్కువగా పెరగవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున పది శాతం మేర మాత్రమే పెరగవచ్చని, ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ పెరుగుదల 4.8 శాతమే ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.

12/09/2016 - 00:22

రాజమహేంద్రవరం, డిసెంబర్ 8: ఆరు నెలల పాటు మేధావులు కసరత్తు చేసి అనుభవజ్ఞులైన నేతలు సైతం ఆమోద ముద్రవేయడంతో నగర ప్రణాళికాబద్ధ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్న మాస్టర్ ప్లాన్‌పై ప్రతిపక్ష వైసిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని నగర అధికార పక్ష తెలుగుదేశం కౌన్సిల్ నేతలు ధ్వజమెత్తారు. దేశం కౌన్సిల్ నేతలు రాజమహేంద్రవర ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

12/09/2016 - 00:21

చింతూరు, డిసెంబర్ 8: పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, పునరావాసంపై ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి విలీన ప్రజలకు అభయమిచ్చారు. పోలవరం ముంపు ప్రాంత ప్రజలు గత మూడేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/09/2016 - 00:21

కాకినాడ, డిసెంబరు 8: జిల్లాలోని ప్రతివొక్కరూ విధిగా మొబైల్/స్మార్ట్ఫోన్లు కలిగివుండాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ సూచించారు. రోజూవారీ కూలీలకు కూడా మొబైల్ నగదు బదిలీ చేయాలని ఆయా వర్గాలకు పిలుపునిచ్చారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసినపుడు ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చన్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.

12/09/2016 - 00:20

అమలాపురం, డిసెంబర్ 8 : నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్రోకారిడార్ ఏర్పాటుతో మహర్ధశ పట్టనుంది.

12/09/2016 - 00:20

మారేడుమిల్లి, డిసెంబర్ 8: జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు వైద్యసేవలు అందని ద్రాక్షలా తయారయ్యాయని, పిహెచ్‌సిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మారేడుమిల్లి గ్రామంలో వనవిహారి అతిథిగృహంలో బుధవారం రాత్రి ఆయన బసచేశారు. గురువారం ఉదయం ప్రజలతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన స్థానిక పిహెచ్‌సిని పరిశీలించారు.

12/09/2016 - 00:19

రాజమహేంద్రవరం, డిసెంబర్ 8: చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలోని వందేళ్ల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అదనపు శాఖలకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆ బ్యాంకు ఛైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

12/09/2016 - 00:18

కాకినాడ సిటీ, డిసెంబర్ 8: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ముమ్మరం చేయాలని జిల్లా కల్టెర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరు నాటికి మరో 159 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించాడానికి తగిన చర్యలు చెపట్టాలన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టుహాలులో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలుకు దత్తత అధికారులుగా నియమించిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

12/09/2016 - 00:16

ఏలూరు, డిసెంబర్ 8 : పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి మొదలైన జనం కష్టాలు నెలరోజులు గడచిపోయినా కొనసాగుతూనే వున్నాయి. ప్రతీ ఒక్కరిలోనూ ఒక్కటే ప్రశ్న వినిపిస్తోంది. ఇంకెన్నాళ్లీ కష్టాలన్న ఆవేదనే కనిపిస్తోంది. బ్యాంకులన్నీ క్యూల మధ్యే కిటకిటలాడిపోతున్నాయి. చిన్న నోట్ల కోసం బారులు తీరుతున్న ఉద్యోగులు, సామాన్య జనమే అన్ని చోట్ల దర్శనమిస్తున్నారు.

Pages