S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 23:47

అమరావతి, డిసెంబర్ 8: మండల కేంద్రమైన అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16 ఎకరాల కాలచక్ర భూములను భూ సేకరణ ద్వారా త్వరలో సేకరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికాశుక్లా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జెసి శుక్లా సిఆర్‌డిఎ, రెవెన్యూ అధికారులతో కలిసి ధ్యానబుద్ధ ప్రాజెక్టు, కాలచక్ర పొలాలను పరిశీలించారు.

12/08/2016 - 23:47

నరసరావుపేట, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దుతో ప్రజలందరూ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నాయకులు అతి వేగంగా పార్టీలు మారుతూ రాజకీయాలను వేడేక్కిస్తున్నారు. రాజకీయాల ఉద్ధండుల కోట, పల్నాడు ముఖద్వారం నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణల నేపధ్యంలో రోజు రోజుకూ రాజకీయాలు మారుతున్నాయి.

12/08/2016 - 23:45

కొత్తగూడెం, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్ధుతో సింగరేణి కార్మికులకు వేతన కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ధ పారిశ్రామిక సంస్థగా సింగరేణి విరాజిల్లుతున్న విషయం విదితమే. మొత్తంగా సింగరేణిలో 54,858 ఎన్‌సిడబ్ల్యు ఎ కార్మికులు, 2,435 ఎగ్జిక్యూటివ్‌లు కలిపి 57,293మంది ఉన్నారు.

12/08/2016 - 23:44

పినపాక, డిసెంబర్ 8: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తూ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, ఇది రోజురోజుకు తుగ్లక్ పాలనగా మారుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య ఆరోపించారు. గురువారం పినపాక మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సామాన్యుడికి గుదిబండగా మారుతుందన్నారు. దీనిపై పేదలే తిరుగుబాటు చేయాలన్నారు.

12/08/2016 - 23:43

జూలూరుపాడు, డిసెంబర్ 8: మండల కేంద్రంలోని జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూలూరుపాడు న్యూకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం, కస్తూరీబా గాంధీ బాలికా విద్యాలయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ గడిపల్లి కవిత గురువారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల సమయపాలన, పనితీరు వంటి విషయాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెట్టి రాంబాబును అడిగి తెలుసుకున్నారు.

12/08/2016 - 23:42

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 8: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను 6నెలలకు ముందు చర్చల ద్వారానే పరిష్కరించుకున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రీజినల్ కార్యదర్శి ఎస్‌వివి ప్రసాద్ పేర్కొన్నారు.

12/08/2016 - 23:41

వైరా, డిసెంబర్ 8: పూర్వవిద్యార్థులంతా కలసి మనకు ఓనమాలు నేర్పిన పాఠశాలను అభివృద్ధి చేసుకుందామని టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు మచ్చా వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని స్టేజి పినపాక ప్రాథమిక పాఠశాలకు బల్లలు, ఐరన్‌సేఫ్‌లు వితరణగా అందించారు. ఈసందర్భంగా ఆనాడు కలిసి చదువుకున్న మిత్రులంతా కలుసుకున్నారు.

12/08/2016 - 23:40

సాలూరు, డిసెంబర్ 8: మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి.్భంజ్‌దేవ్‌కు మంజూరు చేసిన ఎస్టీ కులదృవీకరణ పత్రాన్ని రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్లు వేసినట్టు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయ సలహాదారులు రేగు మహేష్, రిపబ్లికన్ పార్టీ నాయకులు గొంప ప్రకాష్‌లు గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

12/08/2016 - 23:39

గరివిడి (చీపురుపల్లి), డిసెంబర్ 8: నగదు రహిత లావాదేవీల నిమిత్తం వ్యాపారులు సిద్ధం కావాలని సిటిఒ వై.విజయభాస్కరరావు అన్నారు. గురువారం చీపురుపల్లి వైశ్య వర్తక భవనంలో గరివిడి, చీపురుపల్లి మండలాల వ్యాపారులు, డీలర్లతో ఆయన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

12/08/2016 - 23:38

విజయనగరం, డిసెంబర్ 8: నిన్న, మొన్నటివరకు అన్నింటికి నగదును చెల్లించిన వినియోగదారులు నేడు చెల్లింపులకు చెక్కు పుస్తకాలపై ఆధారపడుతున్నారు. చెక్కు పుస్తకాల కోసం ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తున్నాయని ఎల్‌డిఎం గురవయ్య తెలిపారు. ప్రభుత్వం ఇటీవల అన్ని లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఎక్కువ మంది ఎటిఎంలు, చెక్కు పుస్తకాలపై లావాదేవీలు జరుపుతున్నారన్నారు.

Pages