S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 00:16

పత్తికొండ,డిసెంబర్ 6:పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న 106 చెరువులకు నీళ్లు నింపడానికి రూ. 879 కోట్ల తో ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. పత్తికొండలో మంగళవారం అధికారులు, పార్టీ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులలో అందరు కలిసి పని చేయాలని కోరారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని పేర్కొన్నారు.

12/07/2016 - 00:15

కర్నూలు సిటీ, డిసెంబర్ 6:ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రధా ని నరేంద్రమోదీ ఘోరంగా విఫలం చెందారని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం(వ్య.కా.స) రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల శేఖర్ విమర్శించారు. ముఖ్యంగా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను వేధించటం తగదన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు.

12/07/2016 - 00:15

కర్నూలు, డిసెంబర్ 6: హోంగార్డుల సేవలు అమోఘమని ఎస్పీ రవికృష్ణ కొనియాడారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో చేరినప్పటి నుంచి హోంగార్డుల కుటుంబాను చాలా దగ్గర నుంచి చూశామన్నారు. చాలా తక్కువ జీతంతో కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.

12/07/2016 - 00:13

మచిలీపట్నం, డిసెంబర్ 6: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాబు.ఎ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో 08672-252572, 1077 టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

12/07/2016 - 00:12

మచిలీపట్నం, డిసెంబర్ 6: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో క్రీడలను ప్రోత్సహించేందుకు గాను ఈ నెల 15, 16, 17తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణపై మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విద్యా సంస్థల వ్యాయామోపాధ్యాయులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

12/07/2016 - 00:11

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 6: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన మహనీయుడు డా. బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం స్థానిక పంబలగూడెంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.

12/07/2016 - 00:10

మచిలీపట్నం, డిసెంబర్ 6: అమ్మ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం జయలలిత. తమిళ, తెలుగునాట కోట్లాది ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరన్న చేదు నిజాన్ని కృష్ణాజిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణానికి చింతిస్తూ జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించారు. సినీ, రాజకీయ రంగాల్లో ధృవతారగా ఎదిగి నేలకొరిగిన జయలలితకు జిల్లా వాసులు ఘన నివాళులర్పించారు.

12/07/2016 - 00:10

అవనిగడ్డ, డిసెంబర్ 6: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన రెండవ సంవత్సరం విద్యార్థి సజ్జా యోగేష్ కుమార్ ఇస్కాన్ సంస్థ నిర్వహించిన ప్రతిభా పోటీల్లో ప్రతిభా పురస్కారంతో పాటు రూ.7,500 నగదును బహుమతిగా పొందాడు. ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న హరే కృష్ణ 50 సంవత్సరాల ఉత్సవాలు సందర్భంగా ప్రతిభా పోటీలు నిర్వహించారు.

12/07/2016 - 00:09

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 6: భారతదేశం వేదభూమి, ఆచార జ్యోతి ఆంధ్రభూమి అని పరమహంస పరివ్రాజకాచార్య, కంచికామకోటి పీఠం ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజి అన్నారు. పరమహంస పరివ్రాజకాచార్య, కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామీజితో పాటు ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజి పట్టణానికి విచ్చేశారు. స్థానిక గొడుగుపేట శంకర మఠంలో మంగళవారం రాత్రి ఆయన అనుగ్రహ భాషణం చేశారు.

12/07/2016 - 00:09

మోపిదేవి, డిసెంబర్ 6: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక పూర్వక షష్ఠి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారి వసంతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సూపరింటెండెంటు ఎ మధుసూదనరావు పర్యవేక్షణలో వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు బద్దు పవన్‌కుమార్ శర్మ, ఫణిశర్మ తదితరులు వసంతోత్సవ పూజలు నిర్వహించారు.

Pages