S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 23:41

గుంటూరు, డిసెంబర్ 6.. రాజధాని ప్రాంతంలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై సిఆర్‌డిఎ కొరడా ఝుళిపించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. మంగళవారం సిఆర్‌డిఎ పరిధిలోని మంగళగిరి, సత్తెనపల్లి మండలం నందిగామ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లువేసి అనుమతిలేకుండా వెంచర్లువేసినట్లు అధికారులు గుర్తించారు.

12/06/2016 - 23:40

గుంటూరు, డిసెంబర్ 6: విభిన్న కులాలు, మతాలు కలబోత అయిన భారత్‌కు ఏకత్వాన్ని అలవర్చి, దేశ ప్రజలను సమరసత వైపు మళ్లించిన ఆధునిక శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలు రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వామపక్ష నేతలు కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్‌కు ఘననివాళి అర్పించారు.

12/06/2016 - 23:40

మంగళగిరి, డిసెంబర్ 6: మంగళగిరి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో మద్యంషాపు వద్ద ఈనెల 4న జరిగిన ఘర్షణ, పరస్పర దాడి కేసులో నిందితులైన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ గోగినేని రామాంజనేయులు వెల్లడించారు.

12/06/2016 - 23:39

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 6: భిన్నజాతులు, భిన్నమతాలు కలిగిన భారతదేశం విశిష్ఠతను సంఘ పరివార్ శక్తులు, బిజెపి ప్రభుత్వం మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ, ప్రజల మధ్య భేదాభిప్రాయాలను సృష్టిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

12/06/2016 - 23:38

కొత్తగూడెం, డిసెంబర్ 6: బొగ్గుగని కార్మికులకు జాతీయ స్థాయిలో 10వ వేతన ఒప్పందం కోసం జైపూర్‌లో మంగళవారం జాయింట్ బైపార్టెడ్ కమిటీ ఆఫ్ కోల్ ఇండస్ట్రీస్ (జెబిసిసిఐ) సమావేశం ప్రారంభమైంది. రెండురోజుల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. తొలిరోజైన మంగళవారం పరిచయ కార్యక్రమం అనంతరం ఏజెండాను రూపొందించుకున్నారు.

12/06/2016 - 23:37

ఖమ్మం, డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేశాక నిత్యం బ్యాంకుల్లో రద్దీ, ఎటిఎంల వద్ద బారులు, సామాన్య, మధ్య తరగతి చిల్లర కష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమంగా వెనుకేసుకున్న బడాబాబులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో భయపడి వారు నల్లధనాన్ని వదులుకుంటున్నారా, దొడ్డిదారిన దర్జాగా మార్చుకుంటున్నారా అన్న ప్రశ్న జోరుగా సాగుతోంది.

12/06/2016 - 23:36

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 6: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను చూద్దాం... చేద్దాం అని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిషనర్ లక్ష్మీబాయి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ఆమె పరిశీలించారు. మార్కెట్ సమస్యలపై ఆమెకు వివరించడంతో చూద్దాం... చేద్దాం అని చెప్పడమే తప్ప స్పష్టమైన సమాదానాన్ని ఇవ్వలేకపోయారు.

12/06/2016 - 23:36

ఖమ్మం(కల్చరల్), డిసెంబర్ 6: ప్రధానమంత్రి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో రానున్న రోజుల్లో భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి నాగయ్య పేర్కొన్నారు.

12/06/2016 - 23:35

ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 6: పోలీస్ శాఖలో భాగస్వామ్యమైన హోంగార్డులు తమ విధులను నిబద్ధతతో, క్రమశిక్షణతో చేయాలని ఎస్పీ షానవాజ్‌ఖాసీం అన్నారు. 54వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ కుటుంబంలో హోంగార్డులు కూడా ఒకరని, క్రమశిక్షణతో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

12/06/2016 - 23:35

గార్ల, డిసెంబర్ 6: అయోధ్యలో బాబ్రి మసీదు విధ్యంసం ఆటవిక చర్యని న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు జడ సత్యనారాయణ అన్నారు. మండలం పరిధిలోని మద్దివంచ గ్రామంలోని గౌని వీరయ్య భవనంలో మంగళవారం జరిగిన సభలో అయన మాట్లాడుతూ మతోన్నాద శక్తుల కనుసన్నల్లో దేశంలో బిజెపి పాలన సాగుతుందని, లౌకిక దేశంలో మైనార్టీల మసీదును విధ్యంసం చేసి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

Pages