S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 00:08

విజయవాడ (క్రైం), డిసెంబర్ 6: పోలీసు విధుల్లో స్వచ్ఛంద భాగస్వాములై హోంగార్డులు అందిస్తున్న సేవలు అభినందనీయమని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అన్నారు. బందరురోడ్డులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం 54వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా సిపి సవాంగ్ హోంగార్డులనుద్దేశించి ప్రసంగించారు. నిస్వార్థ సేవేతో హోంగార్డులు పోలీసు శాఖతో మిళితమై సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

12/07/2016 - 00:08

విజయవాడ, డిసెంబర్ 6: నగదు రహిత చెల్లింపుల అమలులో దేశంలోనే ముందంజలో నిలిపి మన రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సిద్ధార్థ ఫార్మాసిటికల్ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో నగదు రహిత చెల్లింపులపై సమావేశం నిర్వహించారు.

12/07/2016 - 00:07

విజయవాడ, డిసెంబర్ 6: ‘నా జాతి ప్రజలకు కనీసం మానవ హక్కులను సాధించకపోతే నేను తుపాకీతో కాల్చుకుంటా’నని బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతి హక్కుల కోసం అన్నారని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ 60 వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.

12/07/2016 - 00:06

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: ఎపి సిఆర్‌డిఏ పరిధిలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం కింద నిర్ణీతకాలంలో రెగ్యులరైజ్ కాని దరఖాస్తుల క్లియరెన్స్‌కు మరో అవకాశం ఇస్తున్నట్టు కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు.

12/07/2016 - 00:05

పటమట, డిసెంబర్ 6: ఆంధ్ర లయోలా కళాశాలలో మంగళవారం డిగ్రీ విద్యార్థులకు అష్టావధానం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రఖ్యాత గణితవేత్త టిఎస్‌విఎస్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గణితమంటే విద్యార్థులు భయపడతారని, అయితే గణితంను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే పెద్ద కష్టం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో గణితం ముఖ్యభూమిక పోషిస్తుందన్నారు.

12/07/2016 - 00:05

విజయవాడ, డిసెంబర్ 6: దేశంలోనే మన రాష్ట్రం 10.99 శాతంతో రెండంకెల వృద్ధి సాధించి మొదటిస్థానంలో నిలిచామని రాష్ట్ర విధాన మండలి హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. రెండు రోజులపాటు నగరంలోని సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల హామీలను కమిటీ సమీక్షించింది.

12/07/2016 - 00:04

విజయవాడ (రైల్వేస్టేషన్), డిసెంబర్ 6: నాడు డాక్టర్ అంబేద్కర్ ప్రవచించిన సిద్ధాంతాలే నేడు అమలవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని ఏసి ఆడిటోరియంలో విజయవాడ డివిజన్‌లోని పర్సనల్ బ్రాంచి విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి మంగళవారం జరిగింది.

12/07/2016 - 00:02

కడప,డిసెంబర్ 6: రాష్టవ్య్రాప్తంగా త్వరలో జరగనున్న నగర పాలక, పురపాలక ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో రాజంపేట పురపాలకానికి ఎన్నికలు జరగాల్సివుండగా అధికారపార్టీ నేతల్లో అంతర్గత విభేధాలు, మున్సిపల్ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. రాజంపేటలో తొలి నుంచి ఏపార్టీలోనైనా కమ్మ, రెడ్ల సామాజిక వర్గాల మధ్యే పోరు ఉండేది.

12/07/2016 - 00:02

బద్వేలు, డిసెంబర్ 6: దేశ సేవలో అశువులుబాసిన బద్వేలు ప్రాంతానికి చెందిన కొత్తమద్ది చిన్నవెంకటసుబ్బయ్య మృతదేహం మంగళవారం బద్వేలుకు చేరుకుంది. సిఆర్‌పిఎఫ్ ఎఎస్సై డి.హనుమంతరావు నేతృత్వంలో ముగ్గురు జవాన్లతో కలిసి ప్రత్యేక వాహనంలో వెంకటసుబ్బయ్య మృతదేహాన్ని బద్వేలుకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

12/07/2016 - 00:01

రాజంపేట, డిసెంబర్ 6: నల్లధనాన్ని రూపుమాపేందుకు పెద్దనోట్ల రద్దును ఎవ్వరూ వ్యతిరేకించకపోయినా, ఈ పెద్దనోట్ల రద్దుతో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ముఖ్యంగా డిసెంబర్ మాసం మొదలైన మొదటివారంలో ఫించనుదారులు పడుతున్న అవస్థలు చెప్పనలవి కావడంలేదు. రూ.1000 వృద్ధాప్య ఫించన్ కోసం బ్యాంకుల్లో మరో రూ.1000 జమచేసే దుస్థితిని వృద్ధులు ఎదుర్కొనాల్సి వస్తుంది.

Pages