S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 03:27

తాడేపల్లి, డిసెంబర్ 4: గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలోని మద్యం దుకాణంలో ఏర్పడ్డ వివాదంతో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల కోసం వచ్చిన సూడాన్, నైజీరియా దేశాలకు చెందిన యువకులు, వడ్డేశ్వరం గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడు వేర్వేరుగా మద్యం దుకాణానికి వెళ్లారు.

12/05/2016 - 03:26

గుంతకల్లు, డిసెంబర్ 4: బెంగళూరు-న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మహిళల బోగీలోకి చొరబడిన దొంగలు ఓ ప్రయాణికురాలి నుంచి బంగారం, లగేజీ ఎత్తుకెళ్లాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

12/05/2016 - 03:25

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేందుకు డిసెంబర్ నెలకు సంబంధించి 19.54 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించింది. 29 వేల రేషన్ డిపోల ద్వారా 1.54 కోట్ల మంది లబ్ధిదారులకు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే పేదలకు బియ్యం పంపిణీ ప్రారంభమైంది.

12/05/2016 - 03:24

విశాఖపట్నం, డిసెంబర్ 4: దక్షిణ అండమాన్ సముద్రంలో అండమాన్ దీవులకు సమీపంగా ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగాను, అనంతరం 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగాను బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు.

12/05/2016 - 03:24

డోన్, డిసెంబర్ 4: కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రంగాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వెంగళాంపల్లికి చెందిన కూలీలు పనికోసం ఆదివారం ఆటోలో డోన్ మండలం కొచ్చెరువుకు వెళ్తుండగా రంగాపురం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆటోలోని జ్యోతి(18), మాసుంబీ(35), పెద్దక్క(65) అక్కడికక్కడే మృతి చెందారు.

12/05/2016 - 03:06

హైదరాబాద్, డిసెంబర్ 4: నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత ‘సిట్’ జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అనేక ఉదంతాలపై సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈమధ్య నరుూం గ్యాంగ్‌లో అరెస్టయిన వారిలో కొందరు విడుదల అవుతున్నట్లు తెలుస్తున్నదని ఆయన తెలిపారు.

12/05/2016 - 03:05

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర. ఆయన ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

12/05/2016 - 03:02

సంగారెడ్డి, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అన్ని విధాలుగా ఆటంకం కల్గిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లిళ్లు, పేరంటాలకే కాదు, చివరకు తుది శ్వాస విడిచిన వ్యక్తుల అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించడానికి పెద్ద సంకటం కల్పిస్తోంది.

12/05/2016 - 03:01

నల్లగొండ, డిసెంబర్ 4: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే దసరా నాటికి ప్రధాన ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేసి దేశంలోనే తిరుపతి తరహాలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా యాదాద్రిని తీర్చిదిద్ధాలన్న సీఎం కెసిఆర్ సంకల్పం దిశగా యాడా(యాదాద్రి అభివృద్ధి ప్రాథికార సంస్థ) ముందడుగు వేస్తుంది.

12/05/2016 - 02:57

హైదరాబాద్, డిసెంబర్ 4: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం బతుకమ్మ ఘాట్‌లో తన స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన వికాస్ అనే విద్యార్థి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Pages