S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2016 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 4: వివాహాలకు పెద్ద నోట్ల దెబ్బ బాగా తగిలింది. మంచి ముహూర్తంగా భావిస్తున్న ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగాల్సి ఉండగా, చాలా మంది వాయిదా వేసుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మరో మంచి ముహూర్తం చూడాలంటూ వధూవరుల తల్లిదండ్రులు పండితులను ఆశ్రయిస్తున్నారు.

12/05/2016 - 03:37

కృష్ణగిరి, డిసెంబర్ 4: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్లో బస్సు ఆదివారం తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్‌కు చెందిన వోల్లో బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుండి బెంగళూర్‌కు బయలు దేరింది.

12/05/2016 - 03:36

చోడవరం, డిసెంబర్ 4: వేసవిలో రాష్టవ్య్రాప్తంగా మంచినీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు 120కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కార్యాచరణను రూపొందించినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా, చోడవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

12/05/2016 - 03:34

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే తుదిదశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు 4.35 కోట్ల పైగా ఉన్న కుటుంబాల్లో 4.25 కోట్ల మంది వివరాలను అధికారులు సేకరించారు. అధికారిక జనాభా లెక్కల ప్రకారం మరో 98 లక్షల మంది వివరాలు రాబట్టాల్సి ఉంది. రాష్ట్రంలో నివసిస్తున్న వారి సమగ్ర వివరాల నమోదుకు ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేను ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించింది.

12/05/2016 - 03:33

తిరుపతి, డిసెంబర్ 4: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదివారం బోలెరో మాక్స్ వాహనం విరాళంగా అందింది. పాండిచ్చేరికి చెందిన దొరైరాజ్ దంపతులు రూ.5.5 లక్షల విలువైన ఈ వాహనాన్ని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు చేతులమీదుగా అందజేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట ఈ కార్యక్రమం జరిగింది.

12/05/2016 - 03:42

హిందూపురం, డిసెంబర్ 4: నల్ల కుబేరుల భరతం పట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని, దమ్ముంటే నల్లకుబేరుల పనిపట్టి తమ నిజాయితీ నిరూపించుకోవాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరా సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పలుకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు.

12/05/2016 - 03:31

రాజమహేంద్రవరం, డిసెంబర్ 4: ఆంధ్రా-ఒడిస్సా (ఎఒబి) సరిహద్దుల్లో మావోయిస్టు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడతారనే అనుమానం వెంటాడుతుండటంతో పోలీసులు మన్యాన్ని జల్లెడపడుతున్నారు. ఆంధ్రా-్ఛత్తీస్‌గఢ్-ఒడిస్సా సరిహద్దుల్లో పోలీసులు అణువణువూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

12/05/2016 - 03:30

విజయవాడ, డిసెంబర్ 4: ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. పేద మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ముస్లింలకు పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులకు పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారు.

12/05/2016 - 03:30

తిరుపతి, డిసెంబర్ 4: చిత్తూరు జిల్లాకు 30 వేల ఈపాస్ యంత్రాలను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆదివారం తిరుపతిలో మంత్రి మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యలు, నగదు అందుబాటులో లేని నేపధ్యంలో సిఎం చంద్రబాబు ఆలోచన మేరకు నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి నిర్ణయించామన్నారు.

12/05/2016 - 03:29

విజయవాడ, డిసెంబర్ 4: విశాఖ జిల్లా ఏజన్సీలో గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు లేఖ ఆదివారం రాశారు. పాడేరు ఏజన్సీలో కాఫీ తోటల్లో పని చేసిన గిరిజనులకు 2010 నుంచి 90 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు.

Pages