S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/15/2016 - 07:02

విజయవాడ, నవంబర్ 14: పెద్దనోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసి తాను నల్లధనాన్ని తెలుపు చేసుకున్నానంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలకు అసలు బుద్ధి ఉందా?.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలోనే తాను ముందుగా ఈ డిమాండ్ చేశానని గుర్తుచేశారు. పెద్దనోట్ల రద్దు, తదనంతర పరిణామాల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే తమ తక్షణ కర్తవ్యమని బాబు స్పష్టం చేశారు.

11/15/2016 - 07:01

విశాఖపట్నం, నవంబర్ 14: విశాఖ కేంద్రంగా ఒకేరోజు 50 కోట్ల రూపాయల బంగారం అమ్ముడుపోయింది. ఆశ్చర్యం కలిగించినా ఇది యధార్థం. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించిన రోజు రాత్రి విశాఖ నగరంలో భారీయెత్తున బంగారం విక్రయాలు జరిగినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు.

11/15/2016 - 06:59

గుంటూరు, నవంబర్ 14: గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల పిజి విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మి, అతని భర్త విజయసారథిని గుంటూరు పోలీసులు సోమవారం బెంగుళూరులోని నాగబావి సెంటర్ సమీపంలో అరెస్టు చేశారు. గత 21 రోజులుగా పోలీసులు లక్ష్మి ఆచూకికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

11/15/2016 - 06:22

విజయవాడ (ఇంద్రకీలాద్రి) నవంబర్ 14: కార్తీక మూడో సోమవారం, పౌర్ణమి సందర్భంగా సోమవారం పెద్దసంఖ్యలో భక్తులు నగరంలోని దుర్గాఘాట్‌లో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ ఆలయాల్లో పరమేశ్వరునికి భక్తిప్రపత్తులతో అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించుకున్నారు.

11/15/2016 - 06:20

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ముద్రగడ అయినా, ఎవరైనా సరే ఏదైనా ఆందోళన కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందేనని, ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద కోటి కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

11/15/2016 - 06:18

కొత్తగూడెం టౌన్, నవంబర్ 14: తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలో భాగంగా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికీ నల్లా ఇచ్చేందుకు 45కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు.

11/15/2016 - 06:18

అమరావతి, నవంబర్ 14: ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఎదురయిన రెండు పరిణామాలు ఉత్సాహం కలిగించాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం, మరుసటి రోజునే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ హైకోర్టు నోటీసులివ్వడంతో శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోంది.

11/15/2016 - 06:17

కర్నూలు, నవంబర్ 14: నల్లధనం నిర్మూలణకు కేంద్రం తీసుకున్న చర్యకు మరో నిర్ణయం తోడైంది. బ్యాంకులో ఖాతాదారుల లాకర్లను తెరవడానికి డిసెంబరు 31వ తేదీ వరకు అనుమతించవద్దని సోమవారం ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

11/15/2016 - 06:17

తిరుమల , నవంబర్ 14: తిరుమల్లో ప్రతిమాసం నిర్వహించే పౌర్ణమి గరుడసేవ సోమవారం అంగరంగ వైభంగా సాగింది. సాయంత్రం 7 గంటలకు స్వామివారు గరుడునిపై కొలువుదీరి తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమంలో టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు దంపతులు, జె ఇ ఓ శ్రీనివాసరాజు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

11/15/2016 - 06:15

శ్రీశైలం/ మచిలీపట్నం, నవంబర్ 14: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా జ్వాలాతోరణం నిర్వహించారు. సోమవారం రాత్రి ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సంప్రదాయబద్ధంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం నూలును వెలిగించి జ్వాలా తోరణ మహోత్సవాన్ని శాస్త్రానుసారంగా నిర్వహించారు.

Pages