S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/18/2017 - 01:09

అనంతపురం, ఆగస్టు 17 : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతున్న యశ్వంత్ గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుకునేందుకు తన తల్లిదండ్రులు ఎంతోప్రోత్సహమిచ్చారని, కానీ ఈ లోకంలో తాను మనుగడ సాగించలేనని రాసిన సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/18/2017 - 01:08

గుంటూరు, ఆగస్టు 17: ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్శిటీ, ఆంధ్రా, ఎస్‌వి యూనివర్శిటీలలో సంయుక్తంగా నిర్వహిస్తున్న అగ్రికల్చరల్ బిఎస్‌సి (బైపిసి) స్ట్రీమ్ కోర్సుల కౌనె్సలింగ్ గురువారం గుంటూరు లాంఫాంలో ప్రారంభమైంది.

08/18/2017 - 01:08

లావేరు, ఆగస్టు 17: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక, పరిసర గ్రామాలలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో భూమి స్పల్పంగా కంపించింది. మూడు సెకన్లపాటు ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనతో ఎటువంటి నష్టం సంభవించలేదు. భవిష్యత్‌లో ఈ భూప్రకంపనల ప్రభావం తీవ్రత ఏ మేరకు ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

08/18/2017 - 01:07

విజయవాడ, ఆగస్టు 17: రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ విధానంలో టికెట్ల విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని థియేటర్లలో వివిధ సంస్థలు అన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నాయి.

08/18/2017 - 01:07

తిరుపతి, ఆగస్టు 17: బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.200 కోట్లు వ్యయం చేసిందని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ సంక్షేమానికి గాను 33,162 కుటుంబాలకు రూ.58 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు.

08/18/2017 - 01:06

విజయవాడ (క్రైం), ఆగస్టు 17: ఆయేషామీరా హత్య కేసు పునర్విచారణకు అనుమతి కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు సిట్ అధికారులు రాష్ట్ర డిజిపితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం హాస్టల్‌లో దారుణ హత్య, అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే.

08/18/2017 - 01:06

ప్రత్తిపాడు, ఆగస్టు 17: పాదయాత్రకు అనుమతించని ప్రభుత్వం కనీసం మోకాళ్లపై నడవడానికైనా, లేదా పొర్లు దండాలకైనా అనుమతించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌చేశారు. శుక్రవారంలోగా అనుమతి ఇవ్వని పక్షంలో ఇకపై రోజూ తన ఇంటి గేటు ముందే ఉదయం నుంచి సాయంత్రం దాకా బైఠాయిస్తానని ముద్రగడ ప్రకటించారు. గురువారం సైతం ముద్రగడ పాదయాత్రను పోలీసులు నిలువరించిన సమయంలో ముద్రగడ ఈ విధంగా ప్రకటించారు.

08/18/2017 - 01:05

కాకినాడ, ఆగస్టు 17: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలు అధికార తెలుగుదేశానికి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉండవచ్చన్న కారణంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ప్రచారంలో వెనుకంజ వేశాయి. అయితే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికలపై ఉన్న సందేహాలు వీగిపోయాయి.

08/18/2017 - 01:04

హైదరాబాద్, ఆగస్టు 17: కృష్ణా జిల్లాలో విజయవాడ పోరంకి-మచిలీపట్నం మధ్య జాతీయ రహదారి 65 రోడ్డు వెడల్పుకు సంబంధించి పనులకు హైకోర్టు స్టే ఇచ్చింది. తమ ఇండ్లను రోడ్డు వెడల్పు సందర్భంగా కూల్చివేసే ప్రయత్నాన్ని సవాలు చేస్తూ రమేష్ కిలారు మరో 71 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు విచారించారు.

08/18/2017 - 01:04

హైదరాబాద్, ఆగస్టు 17: కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాని పిటిషన్లను విచారిస్తామని, తుది తీర్పుకు లోబడి ఎన్నికలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో కోర్టుల జోక్యం పరిమితంగా ఉంటుందని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Pages