S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/18/2017 - 03:06

విజయవాడ, ఆగస్టు 17: గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో కాపాడిన ఘటనను ఒక కేస్ స్టడీగా తీసుకుని డాక్యుమెంట్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తల్లితండ్రులతో కలిసి మృత్యుంజయుడు చంద్రశేఖర్‌ను మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులు గురువారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకువచ్చారు.

08/18/2017 - 02:50

విశాఖపట్నం, ఆగస్టు 17: భారత నౌకాదళానికి చెందిన మహిళలు సముద్రంపై ప్రపంచ యాత్ర చేయడానికి సన్నద్ధమయ్యారు. నావికా సాగర్ పరిక్రమ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళా నావికులు ఈ యాత్రకు వచ్చే నెల మొదటి వారంలో బయల్దేరనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్‌వి తరణిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నౌకాదళ కమాండ్‌లకు చెందిన ఆరుగురు మహిళలు అత్యంత సాహసోపేతమైన ఈ యాత్రకు బయల్దేరనున్నారు.

08/18/2017 - 03:54

హైదరాబాద్, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (విజయవాడ), కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం (వరంగల్) ద్వారా జరగాల్సిన సూపర్ స్పెషాలిటీ డిఎం, ఎంసిహెచ్ కోర్సుల కౌన్సిలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు స్టే మంజూరు చేసింది.

08/18/2017 - 02:44

హైదరాబాద్, ఆగస్టు 17: వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా నంద్యాల ప్రజల మనస్సు మార్చలేరని, వైకాపా విజయం ఖాయమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టిడిపి నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఏదో విధంగా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

08/18/2017 - 02:43

నెల్లూరు రూరల్, ఆగస్టు 17: నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ శాసనసభ్యునికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న పొట్టెపాళెం గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుండి ఈ దాడులు ఏకధాటిగా కొనసాగుతూ ఉన్నాయని, ఈ దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

08/18/2017 - 02:43

విశాఖపట్నం, ఆగస్టు 17: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి తెలియజేసింది. రానున్న రెండు రోజుల్లో ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రాలో ఒకటి, రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం తెలియజేసింది.

08/18/2017 - 02:41

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ను నాశనం చేయదల్చుకున్నారా? అంటూ సుప్రీంకోర్టు గురువారం నాడు కేంద్రప్రభుత్వాన్ని నిలదీసింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుండి ఢిల్లీకి అదనపు రైలు మార్గం కోసం తాజ్‌మహల్ సమీపంలో 400 చెట్లను కొట్టి వేయడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది ఎంసి మెహతా దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కటువైన మాటలను ఉపయోగించింది.

08/18/2017 - 02:39

హైదరాబాద్, ఆగస్టు 17: జనసేన పార్టీలో త్వరలో రెండు విభాగాలను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే పనిలో పడిన పవన్‌కల్యాణ్ ఒక్కో విభాగానికి వూపిరి పోస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో పార్టీ తరఫున జనసేన విద్యార్ధి విభాగం, జనసేన మహిళా విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

08/18/2017 - 02:36

కర్నూలు, ఆగస్టు 17: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు గంగుల ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో గురువారం ఉదయం నుంచి నంద్యాలలో హైడ్రామా నడిచింది. గంగుల చేరికను ఎవరూ ఊహించకపోవడం, ఆయనతో చర్చలు జరిపిన టిడిపి నేతలు సైతం రహస్యంగా మంతనాలు నిర్వహించి విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో మీడియాలో వార్తలు వచ్చేవరకు ఎవరికీ తెలియలేదు.

08/18/2017 - 01:09

కాకినాడ, ఆగస్టు 17: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెబుతున్న మాటలు నమ్మితే మరో 30 ఏళ్లు వెనక్కి పోతారని రాష్ట్రంలోని కాపు సామాజికవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. ముద్రగడ చెప్పే తప్పుడు మాటలు నమ్మవద్దని కోరారు.

Pages