S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/13/2016 - 03:52

విజయవాడ, ఆగస్టు 12: కృష్ణ పుష్కరాల తొలి రోజు వెలవెలబోయింది. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్క ఘాట్ కూడా భక్తులతో కళకళలాడలేదు. తొలి రోజు భారీగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఘాట్‌లన్నీ ఖాళీగా కనిపించాయి. శుక్రవారం తెల్లవారుజామున కొన్ని ఘాట్‌లలో జనం ఒక మోస్తరుగా కనిపించారు.

08/13/2016 - 03:17

కాకినాడ, ఆగస్టు 12: ‘ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు... ఒక నెత్తుటి బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు..’ అని నినదించిన వజ్రాయుధ కవి, ప్రముఖ విమర్శకుడు డాక్టర్ ఆవంత్స సోమసుందర్ కన్నుమూశారు. 20 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమసుందర్ శుక్రవారం ఉదయం 11.45 గంటలకు కాకినాడ సమీపంలోని సర్పవరంలో తన కుమారుని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఆయన

08/13/2016 - 03:45

విజయవాడ, ఆగస్టు 12: 144 ఏళ్లకు వచ్చిన గోదావరి మహా పుష్కరాలు, 12ఏళ్లకు వచ్చిన కృష్ణా పుష్కరాలకు సరిగ్గా ఏడాది కాలంలో స్వాగతం పలికిన అరుదైన అవకాశం లభించటంతో తన జీవితం ధన్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తపర్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి అవకాశం వచ్చి ఉండకపోవచ్చన్నారు.

08/12/2016 - 17:54

విజయవాడ: విజయవాడలో శుక్రవారం పుష్కర స్నానానికి నీటిలో దిగిన కిరణ్‌కుమార్‌ అనే ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. పద్మావతి పుష్కర ఘాట్‌ వద్ద ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.

08/12/2016 - 15:52

విజయవాడ: కవిగా, విమర్శకుడిగా అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్‌ సాహితీ రంగానికి సేవలందించారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యంమంత్రి చంద్రబాబు కొనియాడారు. సోమసుందర్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.

08/12/2016 - 15:28

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళలో మార్పులు చేశారు. ఉదయం 6 నుండి 8 వరకు, సాయంత్రం 7 నుండి 8.30 వరకు వీఐపీ దర్శనానికి సమయం కేటాయించారు. రేపటి నుండి అన్‌లైన్‌లో రూ.500 దర్శనం టికెట్లను విక్రయించనున్నారు. దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు పున్నమి ఘాట్ నుండి వాహన సదుపాయం కల్పించనున్నారు.

08/12/2016 - 15:19

గుంటూరు: గుంటూరు జిల్లా నాదెండ్లలో శుక్రవారం ఇద్దరు మహిళలపై వినోద్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

08/12/2016 - 15:15

గుంటూరు: చిన్నారుల మృతితో గుంటూరు శివారులోని ఓబులనాయుడు పాలెంలో శుక్రవారం విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటికుంటలోపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

08/12/2016 - 15:03

అనంతపురం : కక్కలపల్లి సమీపంలో ఇద్దరు యువకులు గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. బుక్కచర్ల నుంచి మిత్రుడు అశోక్‌రెడ్డితోకలిసి జయచంద్రారెడ్డి తన సోదరిని ఆటోలో అనంతపురం అనంతపురం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం జయచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డిలు తిరిగి బుక్కచర్లకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేసి గొంతుకు తాడుతో బిగించి హతమార్చారు.

08/12/2016 - 14:36

హైదరాబాద్-విజయవాడ: కృష్ణా పుష్కరాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వేకువజామున వైభవంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం ఎపి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుష్కరాల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు పుష్కరశోభను సంతరించుకున్నాయి.

Pages