S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/11/2016 - 08:43

గుంటూరు, ఆగస్టు 10: ‘కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే ప్రత్యేక హోదా రాదు. మైత్రి కొనసాగిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ సాధిస్తాం. అలాగని ప్రత్యేక హోదాను మేం వ్యతిరేకిస్తున్నట్లు కాదు’.. అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

08/11/2016 - 08:42

కర్నూలు, ఆగస్టు 10 : కృష్ణా పుష్కరాల సమయంలో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటు యాత్ర ఏర్పాటు చేయాలన్న కలెక్టర్ విజయమోహన్ ప్రయత్నాలకు ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా బోటు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

08/11/2016 - 08:37

విజయవాడ, ఆగస్టు 10: కృష్ణా పుష్కారాలను వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా పక్కా జాగ్రత్తలు తీసుకుంటోంది. పుష్కరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒకేచోట పెద్దఎత్తున భక్తులు చేరకుండా చూడాలని, అలా చేయడం ద్వారా నియంత్రించాలని అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.

08/11/2016 - 08:33

కాకినాడ/ విజయవాడ, ఆగస్టు 10: కోనసీమలోని ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి పంచాయతీ పరిధిలోని సుధాపాలెంలో దళితులపై జరిగిన దాడి ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. నేర సంఘటనల్లో దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు.

08/11/2016 - 08:14

విజయవాడ, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ఏ సమయంలో స్నానమాచరించినా పుణ్యం సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో చేపట్టిన సంకల్ప బలమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా జలసిరికి కారణమన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్భంలో ఎటువంటి వదంతులు వచ్చినా ప్రజలు నమ్మవద్దని అన్నారు.

08/11/2016 - 08:13

విజయవాడ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యూనివర్శిటీని నెలకొల్పేందుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ముందుకొచ్చింది. బుధవారం విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ట్రస్ట్ ప్రతినిధులు కలుసుకున్నారు.

08/11/2016 - 08:10

హైదరాబాద్, ఆగస్టు 10: పుష్కరాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ నెల 28వ తేదీ వరకూ పాఠశాలలకు సెవలు ప్రకటించడంతో పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్టు మారింది. సెలవులకు సంబంధించి ఇటు కృష్ణా కలెక్టర్, అటు గుంటూరు కలెక్టర్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.

08/11/2016 - 08:09

హైదరాబాద్, ఆగస్టు 10: తనకు ఏది అనుకూలంగా ఉంటుందో దాని గురించి ప్రచారం చేయడంలో పేరున్న తెదేపా ఇప్పుడు హోదాను మానసికంగా తెరమరుగు చేసి, ప్యాకేజీని తెరపైకి తీసుకువస్తోంది. కేంద్రం నుంచి ఆ మేరకు సంకేతాలు రావడంతో హోదా డిమాండును అటకెక్కించి, ప్యాకేజీకి అధిక ప్రచారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలను కూడా ఆ మేరకు మానసికంగా సిద్ధం చేసే ప్రచారానికి పదునుపెట్టింది.

08/11/2016 - 07:00

రాజమహేంద్రవరం, ఆగస్టు 10: గోదావరి అంత్య పుష్కరాలు గురువారంతో ముగియనున్నాయి. అంత్య పుష్కరాల్లో పదకొండో రోజు పావన గోదావరిలో పుణ్యస్నానాలతో భక్తజనం తరించారు. బుధవారం జిల్లాలో సుమారు 97 వేల మంది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి నది అంత్య పుష్కర ఘట్టం చివరి అంకానికి చేరింది. పుష్కరుడు గోదావరి నదిలో గురువారం సంధ్యా సమయం వరకు అంటే పనె్నండు గంటల పాటే ఉంటాడు.

08/11/2016 - 06:13

విజయవాడ, ఆగస్టు 10: పనె్నండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాలు గురువారం లాంఛనంగా ప్రారంభమవుతున్నాయి. గోదావరి నదికి అంత్య పుష్కరాలు గురువారం సాయంత్రంతో ముగియనున్నాయి. అక్కడి నుంచి పుష్కరుడు కృష్ణానదిలో గురువారం రాత్రి 9.15 గంటలకు ప్రవేశించనున్నాడు. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నదికి పవిత్ర పూజలు చేస్తారు.

Pages